తెలుగు ఇండస్ట్రీలో స్టార్ దర్శకులుగా ఈ మద్య కొద్ది మంది మాత్రమే సక్సెస్ సాధించారని చెప్పొచ్చు.  ఈ కోవలోకి వస్తారు..బోయపాటి శ్రీనివాస్..గత సంవత్సరం అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘సరైనోడు’ బ్లాక్ బస్టర్ సాధించించిన విషయం తెలిసిందే.  గతంలో నందమూరి బాలకృష్ణతో సింహ, లెజెండ్ చిత్రాలతో ఆల్ టైమ్ రికార్డు స్థాపించాడు.  ఇండస్ట్రీలో ఇప్పుడు బోయపాటికి మంచి డిమాండ్ ఉన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్యకు సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని బోయపాటిని అక్కినేని నాగార్జున సంప్రదించినట్లు సమాచారం.  
Image result for saironodu
‘జోష్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలు సూపర్ హిట్ టాక్ ఏవీ రాలేదు..అంతే కాదు కానీ స్టార్ డం ని మాత్రం అందుకోలేక పోతున్నాడు.  గతంలో నాగార్జున ఎంట్రీ ఇచ్చిన సమయంలో వరుస విజయాలతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు.  అందుకే ఇలా అయితే లాభం లేదని బోయపాటి శ్రీను లాంటి మాస్ దర్శకుడి చేతిలో పడితేనే నాగచైతన్య మాస్ హీరో అవుతాడని భావిస్తున్నాడట అందుకే బోయపాటి కి కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చాడట.
Image result for naga chaitanya
నాగచైతన్య కు మంచి హిట్ సినిమా ఇస్తే..12 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడట.  ఇక బోయపాటి సినిమాలంటే హీరోటను మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యేలా చేస్తాడని అందరికీ తెలుసు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జయ జానకి నాయక అనే సినిమా చేస్తున్నాడు బోయపాటి దాని తర్వాత చిరంజీవి తో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు . ఒకవేళ అది కుదరకపోతే నాగచైతన్య తో సినిమా చేస్తాడు బోయపాటి.


మరింత సమాచారం తెలుసుకోండి: