‘బిగ్ బాస్’ షో ద్వారా బుల్లితెర పైకి ప్రవేసించబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ ఫస్ట్ లుక్ టీజర్ బయటకు వచ్చిన కొద్ది గంటలలోనే ఆ టీజర్ పై విమర్శలు ప్రారంభం అయిపోవడం షాకింగ్ న్యూస్ గా మారి పోయింది. సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తయారుచేయపడ్డ ఈ టీజర్ ను ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్న స్టార్ మాటివి నిన్న విడుదల చేసింది. 

అయితే ఈ టీజర్ విడుదల అయిన కొద్ది సేపటికే ఈ టీజర్ పై విమర్శలు రావడం జూనియర్ అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారింది. ఎన్టీఆర్ ను సూటు బూటు గెటప్ లో చూడడం చాలా అరుదైన సందర్భం కావడంతో ఈలుక్ ను చూసి తారక్ అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు. 

అయితే సమస్య అంతా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతందగ్గర వచ్చింది. ఈ టీజర్ ను చూసిన చాలామంది హాలీవుడ్ సినిమాలలోని ‘జేమ్స్ బాండ్’  సినిమాలకు సంబంధించి టైటిల్స్ కార్డ్స్ పడేటప్పుడు వచ్చే మ్యూజిక్ ని పోలి ఈ టీజర్ లో వచ్చిన మ్యూజిక్ ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో జూనియర్ బిగ్ బాస్ షో లో  కొత్తదనం ఆశించే ప్రేక్షకులు మాత్రం పూర్తిగా నిరాశ చెందుతారు అని కామెంట్స్ వస్తున్నాయి.

దీనికితోడు ‘బిగ్ బాస్’ షో కాన్సెప్ట్ కు దూరంగా ఈ టీజర్ ఉండడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. వాస్తవానికి  థమన్ ఇలా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఈ షోటీమ్ ఎలా అంగీకరించింది అన్న కామెంట్స్  వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం లో జూనియర్ ఎన్టీఆర్ ను నిందించడానికి ఏమీఅవకాశం లేక పోయినా అత్యంత భారీ అంచనాలతో మొదలు కాబోతున్న ఈ షో ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైన కొద్ది సేపటికే ఆ టీజర్ పై విమర్శలు ప్రారంభం కావడంతో ఈ షో విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోక పోతే చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఫలితాలు వచ్చీ ఆస్కారం ఉంది అన్న కామెంట్స్  వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: