దక్షిణాది సినిమా రంగ సెలెబ్రెటీలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సెలెబ్రెటీలు అత్యంత గౌరవంగా ఫిలిం ఫేర్ అవార్డులను గుర్తిస్తారు. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డుల కంటే మన టాలీవుడ్ సెలెబ్రెటీలు ఫిలిం ఫేర్ అవార్డులను ఎంతో మురిపంగా భావిస్తారు. 

అంతేకాదు ఫిలిం ఫేర్ అవార్డ్ ల ఫంక్షన్ కోసం మన దక్షిణాది స్టార్స్ తమ సినిమా షూటింగ్ లను కూడ పక్కకు పెట్టి ఆ అవార్డ్ ఫంక్షన్ ను చూడటానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి క్రేజీ ఫిలిం ఫేర్ అవార్డ్ ను జూనియర్ ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. 

నిన్న రాత్రి హైటెక్స్ లో జరిగిన కనులు మిరుమిట్లు గొలిపే ఫంక్షన్ లో జూనియర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది. బెస్ట్ యాక్టర్ ఫిమేల్ వింగ్ లో సమంతకు ఉత్తమ నటి అవార్డ్ లభించింది ఉత్తమ సహాయ నటుడుగా జగపతి బాబు ఉత్తమ సహాయ నటిగా నందిత అవార్డ్ లను అందుకున్నారు.

ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డ్ దేవీశ్రీప్రసాద్ కు వస్తే ఫిలిం ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ అల్లు అర్జున్ కు రావడంతో బన్నీ జూనియర్ అభిమానులకు ఈ ఏడాది ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ పండుగగా మారింది. ఉత్తమ పాటలు రచయితగా రామజోగయ్య శాస్త్రి అవార్డ్ ను అందుకుంటే ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్స్ గా కార్తీక్ కేస్ చిత్రాలు ఎంపిక అయ్యారు.

ఈసారి ఫిలిం ఫేర్ అవార్డ్స్ కూడ జూనియర్ బన్నీల సొంతం అవ్వడంతో ఇప్పటికే టాప్ యంగ్ హీరోల రేస్ లో దూసుకు పోతున్న ఈ ఇద్దరికీ అవార్డ్స్ మరింత జోష్ ను ఇచ్చే ఆస్కారం ఉంది. ఈ వారం విడుదల కాబోతున్న ‘దువ్వాడ’ రిలీజ్ డేట్ కు ముందు బన్నీకి స్పెషల్ జ్యూరీ అవార్డ్ రావడం మరింత అల్లుఅర్జున్ అభిమానులకు జోష్ ను ఇచ్చే అంశం..   


మరింత సమాచారం తెలుసుకోండి: