సినిమా రంగంలో సెంటిమెంట్లు సర్వ సాధారణం టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న మెగా ఫ్యామిలీకి కూడ కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి కొత్తగా ఏర్పడిన ఒక సెంటిమెంట్ పై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. టాప్ హీరోల సినిమాల ప్రారంభోత్సవాలు అంటే ఆ ప్రారంభోత్సవం కూడ అత్యంత ఘనంగా జరగడం ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్.

అయితే ఈ ట్రెండ్ ను మెగా ఫ్యామిలీ మార్చి మరొక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ పద్ధతిని ఇప్పుడు మెగా కుటుంబ హీరోలు అంతా అనుసరిస్తున్నారు. ఆఖరికి చిరంజీవి లాంటి మెగా స్టార్ కూడ తన ‘ఖైదీ నెంబర్ 150’ కి ఆడియో ఫంక్షన్ కు బదులు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించి బన్నీ ఒరవడిని ఫాలో అయ్యాడు. 

ఇలాంటి పరిస్థుతులలో అల్లుఅర్జున్ ఈమధ్య ప్రారంభించిన వక్కంతం వంశీ మూవీ ప్రాజెక్ట్ ను అత్యంత నిరాడంబరంగా ఎటువంటి హడావిడి లేకుండా ప్రారంభించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ విషయంలో బన్నీ తన మేనమామ చిరంజీవి ఒరవడిని ఫాలో అవుతున్నాడు అని అనిపిస్తోంది. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ ప్రారంభోత్సవం కూడ అత్యంత నిరాడంబంరంగా జరిగిన విషయం తెలిసిందే. 

ఇలా నిరాడంబరంగా షూటింగ్ ప్రారంభించిన మెగా హీరోల సినిమాలు అన్నీ భారీ హిట్స్ గా మారుతున్న నేపధ్యంలో ఇదే పద్దతిని పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ లు అనుసరిస్తూ ఉండటంతో టాలీవుడ్ సినిమాల ప్రారంభోత్సవానికి సంబంధించి జరిగే హడావిడి పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ సెంటిమెంట్ మెగా హీరోలకు బాగా కలిసి వచ్చిందని తెలియడంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు అంతా తమ సినిమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు అతి నిరాడంబరంగా జరిపించేస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

ఏమైనా మెగా కుటుంబం అనుసరిస్తున్న ఈ కొత్త సెంటిమెంట్ వల్ల టాప్ హీరోలతో సినిమాలు తీసే నిర్మాతలకు ఆ సినిమాల ప్రారంభోత్సవ ఫంక్షన్స్ కు అయ్యే ఖర్చులు మిగిలే పరిస్థుతులు ఏర్పడ్డాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: