మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో ఇంకా కన్ ఫ్యూహన్ కొనసాగుతూనే ఉంది. ప్రెస్టిజియస్ సినిమా కాబట్టి సినిమా హీరోయిన్ విషయం లో రిస్క్ తీసుకోలేని మెగా టీం హీరోయిన్ గా అనుష్కను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.  


స్వాతంత్ర సమరయోధుడు 150 ఏళ్ల క్రితం జరిగిన కథ కాబట్టి సినిమాలో అనుష్క అయితే బాగుంటుందని ఆమెతో చర్చలు జరుపుతున్నారట. అరుంధతితో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ఓ వన్నెతెచ్చిన అనుష్క రుద్రమదేవి, బాహుబలి సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం భాగమతిగా కనిపించబోతున్న అనుష్క ఉయ్యాలవాడ సినిమా గురించి ఆలోచనలో పడ్డదట. 


సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అఫిషియల్ న్యూస్ రాకుండానే సినిమా గురించి అన్నంతటా చర్చలు నడుస్తున్నారు. ఖైదితో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ మళ్లీ అదే హిట్ మేనియాను ఉయ్యాలవాడతో కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. ఇక బాహుబలి సృష్టించిన సంచలనం తెలుసు కాబట్టి అదే తరహాలో ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళ హింది భాషల్లో కూడా తెరకెక్కించాలని చూస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: