ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ‘ఫాదర్స్ డే’ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి తనను గట్టిగా మందలించిన సందర్బాలను గుర్తుకు చేసుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా షూటింగులో బిజీగా ఉన్న రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గురించి అనేక విషయాలతో పాటు తండ్రి కొడుకులుగా తమ ఇద్దరి అనుబంధం గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తిక కామెంట్స్ చేసాడు. 

తన జీవితంలో ఒకే ఒకసారి  తన తండ్రి చిరంజీవి తనపై గట్టిగా కోప్పడ్డారని అయితే  ఆ తర్వాత  చిరంజీవి తనను తనపై కోప్పడిన  సందర్బాలు లేకపోయినా అప్పట్లో తన తండ్రి తనపై చూపించిన కోపాన్ని తాను ఎప్పుడు మరిచిపోను అంటూ కామెంట్స్ చేసాడు. ఈరోజు జరుగుతున్న ఫాదర్స్ డే సందర్భంగా తన  పేస్ బుక్  పేజీలో తన తండ్రికి ‘ఫాదర్స్ డే’ విషెస్ చెబుతూ కొన్నిరేర్ ఫోటస్ అభిమానులతో పంచుకున్నాడు.

ఒకానొక సందర్భంలో తాను తన తల్లితో మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటకు ఎదురు చెప్పడంతో తన తండ్రికి కోపం వచ్చిన విషయాన్ని బయట పెడుతూ  అప్పట్లో తన తల్లి మాటకు ఎదురు చెప్పినందులకు అప్పట్లో తన తండ్రి తనకు పీకిన క్లాసు తనకు ఇప్పటికీ గుర్తు ఉంది అంటూ అప్పటి జ్ఞపకాలను గుర్తుకు  చేసుకున్నాడు.  అంతేకాదు తన తండ్రి చాల గొప్ప సేవా భావం ఉన్న వ్యక్తి అని చెపుతూ తన తండ్రికి మహిళలు అన్నా పిల్లలు అన్నా ఎంతో గౌరవం అభిమానం అన్న విషయాన్ని బయట పెట్టాడు. 

ఇక తన తల్లితో తన అనుబంధం గురించి వివరిస్తూ తన ఆనందం, విచారం అన్నీ ఆమెతోనే పంచుకుంటానని అంటూ  తామిద్దరం ఎంత ప్రేమగా ఉంటామో అప్పుడప్పుడు అంతే స్థాయిలో గొడవ పడతాం మాటామాటా విసురుకుంటామన్న ఆసక్తికర విషయాలను లీక్ చేసాడు చరణ్. ప్రస్తుతం చరణ్ తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసిన మెసేజ్ మెగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: