ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు పొందుతున్న అడవి శేషు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘కర్మ’ సినిమా ద్వారా పరిచయం అయిన ఈ విలక్షణ నటుడు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాల పాట్లు పడ్డాడు.

పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమాలో నెగిటివ్ పాత్రను చేసిన తరువాత ఈనటుడుకి మంచి గుర్తింపు రావడమే కాకుండా అవకాశాలు కూడ బాగానే వచ్చాయి. అయితే మొదట్లో తాను పవన్ సినిమాలో విలన్ పాత్రలో నటించకూడదని భావించి తాను ఆపాత్రను తిరస్కరించడానికి చాల ప్రయత్నాలు చేసిన విషయాన్ని బయట పెట్టాడు. 

తాను అమెరికాలో సంపాదించిన డబ్బుతో మొదట్లో సినిమాలలో అవకాశాల గురించి విమానాలలో తిరుగుతూ అందరి దగ్గరకి వెళ్ళిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ సమయంలో తాను నిర్మించిన ‘కర్మ’ మూవీ బాగా సక్సస్ అవుతుందని కలలు కన్న విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఆ సినిమా విడుదల చేయడానికే తన వద్ద డబ్బు అయిపోవడంతో తాను పడ్డ సినిమా కష్టాలను వివరించాడు. 

ఆ పరిస్థుతులలో కన్నడ దర్శకుడు పవన్ తీస్తున్న ‘పంజా’ సినిమా నెగిటివ్ రోల్ ఆఫర్ చేసినా తాను పెద్దగా ఆ పాత్రలో నటించడానికి ఇష్టపడని సందర్భాన్ని వివరిస్తూ అప్పట్లో తన కజిన్ బ్రదర్ అడవి సాయి కిరణ్ బలవంతం పై అయిష్టంగా పవన్ తో సినిమా చేసిన విషయాన్ని బయట పెట్టాడు. అయితే ఆ సినిమా ఫెయిల్ అయినా తనకు మంచి అవకాశాలు వచ్చాయి అని చెపుతూ ఒక విధంగా ప్రస్తుతం తన అదృష్టానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారకుడు అంటూ పవన్ అభిమానుల మనసులను దోచే ప్రయత్నాలు ఈ మీడియా ఇంటర్వ్యూలో చేసాడు ఈ యంగ్ హీరో..   



మరింత సమాచారం తెలుసుకోండి: