చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ప్రథమ స్వాతంత్ర సమరానికి ముందు జరిగిన వాస్తవ కథ కావడంతో ఈసినిమాకు సంబంధించి అన్ని విషయాలలోనూ భారీ తనం ఉండేలా రామ్ చరణ్ ఈసినిమా పై భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నాడు.

ఇప్పటికే ఈసినిమాలోని పాటలకు సంబంధించి జరిగిన మ్యూజిక్ సిటింగ్స్ ఫోటోను సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తన ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో ఈ సంగీత దర్శకుడు ఆధ్వర్యంలో ‘ఉయ్యాలవాడ’ పాటలు ఉండబోతున్నాయి అని భావించారు అంతా. దీనికితోడు గతంలో చిరంజీవి ‘బ్రూస్ లీ’ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తన భవిష్యత్ సినిమాలకు ధమన్ కు అవకాశం ఇస్తాను అని చెప్పడంతో ‘ఉయ్యాలవాడ’ ద్వారా ధమన్ కోరిక నెరవేరింది అని అనుకున్నారు అంతా.

అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ మూవీ ప్రాజెక్ట్ లో ధమన్ ప్లేస్ లో ఎఆర్ రెహమాన్ వచ్చి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ మూవీని తమిళ కన్నడ భాషలలో అదేవిధంగా హిందీలో కూడ డబ్ చేసి విడుదల చేయాలి అన్న ఆలోచనలు రావడంతో ఈ మూవీకి రెహమాన్ పేరు వచ్చి చేరితే మరింత క్రేజ్ పెరిగి బిజినెస్ పరంగా అనుకూలిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చరణ్ రెహమాన్ ను కాంటాక్ట్ చేయడం ఈ ప్రాజెక్ట్ విషయమై అతడి అంగీకారం పొందడం కూడ జరిగిపోయింది అన్న వార్తలు గాసిప్పులుగా హడావిడి చేస్తున్నాయి. ‘ఉయ్యాలవాడ’ కోసం మ్యూజిక్ ఇచ్చినందుకు రెహమాన్ కు 2 కోట్ల భారీ పారితోషికం కూడ ఆఫర్ చేసినట్లు టాక్. ఈ వార్తలే నిజం అయితే ధమన్ ఆశల పై మెగా కాంపౌండ్ నీళ్ళు జల్లింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: