వరస విజయాలతో దూసుకుపోతున్న నాని కెరియర్ ప్రస్తుతం మంచి పీక్ పై ఉంది. ఆ మధ్య కొన్ని పరాజయాలతో తికమక పడ్డ నాని ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ సినిమా నుండి తిరిగి ట్రాక్ పైకి వచ్చి డబల్ హ్యాట్రిక్ విజయాలను  సాధించడమే కాకుండా ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన ‘నేను లోకల్’ ఘన విజయంతో 35 కోట్ల హీరోగా మారి నాని కెరియర్ ప్రస్తుతం దూసుకు పోతోంది.

ఇలాంటి పరిస్థుతులలో నాని తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి వచ్చేనెల ‘నిన్నుకోరి’ సినిమా ద్వారా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఈసినిమా టీజర్ ను అదేవిధంగా ఈమూవీ ట్రైలర్ ను చూసిన కొంతమంది విశ్లేషకులు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీ ఇంటెన్స్ లవ్ స్టోరీ అన్న ఫీలింగ్ కలుగుతోందని నాని ఇంతకుముందు చేసిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ను గుర్తుకు తెస్తోందీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ఇలాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీలకు పాజిటివ్ టాక్ వచ్చినా మాస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడంతో వసూళ్లు భారీగా ఉండవు. ‘ఏటోవెళ్ళి పోయింది మనసు’ సినిమా విడుదలైన సమయంతో పోలిస్తే ప్రస్తుతం నాని రేంజ్ విపరీతంగా పెరిగిన నేపధ్యం వాస్తవమే అయినా ఈ క్యూట్ లవ్ స్టోరీకి భారీ కలక్షన్స్ ఎంత వరకు వస్తాయి అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

మరి కొందరైతే ఈ మూవీ సెలక్షన్ విషయంలో నాని పొరపాటు చేసాడు అంటూ ఇంకా ఈమూవీ విడుదల కాకుండానే కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాని సన్నిహితుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ మూవీ ట్రైలర్ ను చూసి ఈమూవీని జూలై 7న మొదటిరోజు మొదటి షో చూడబోతున్నాను అని ట్విట్ చేయడంతో ఒక విధంగా రాజమౌళి నాని ‘ఏటోవెళ్ళిపోయింది’ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: