ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు విపరీతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి న్యూస్ చదువుతూనే ఉంటాం..టీవిల్లో చూస్తూనే ఉంటున్నాం.  అయితే గత కొంత కాలంగా సెలబ్రెటీలకు కూడా ఇలాంటి లైంగిక వేధింపులు తప్పడం లేదని ఆ మద్య మళియాళ సినీ నటి భావన విషయంలో తెలిసింది.  భావన ను ఆమె డ్రైవర్ అపహరించి లైంగిక వేధింపులకు దిగిన విషయం యావత్ భారత దేశం సంచలనం సృష్టించింది.  నటి భావన మాత్రం ఈ విషయాన్ని అంత సింపుల్ గా తీసుకోకుండా దోషులకు శిక్ష పడే వరకు పోరాడింది.  
Image result for bhavana rape
ఆ తర్వాత ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు కూడా గతంలో కొంత మంది ఇండస్ట్రీ పెద్దలు తమతో అసహ్యంగా ప్రవర్తించారని..లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించారు.  తాజాగా ఓ కన్నడ నటుడు తన సహనటిని బ్లాక్ మెయిట్ చేస్తున్నాడంటూ వార్తలు సంచలనం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే..కన్నడ పోకిరి చిత్రంలో నటించిన 'హుచ్చ వెంకట్ ' అనే నటుడు కన్నడ పరిశ్రమకే చెందిన నటిని ప్రేమించాడు.  తన సహనటుడు కావడంతో ఆమె కూడా వెంకట్ తో చాలా క్లోజ్ గా ఉండటంతో ఆమె తనను ప్రేమిస్తుందని కానీ ఆమె కుటుంబ సభ్యుల తమ పెళ్లికి అడ్డు చెబుతున్నారని ప్రచారం మొదలు పెట్టాడు.
Image result for bhavana rape
దీంతో ఖంగు తిన్న సదరు నటి తనను వెంకట్ తప్పుగా అర్థం చేసుకున్నాడని చెప్పడంతో..మనోడు నిన్న ఆత్మహత్యా యత్నం చేశాడు.  తన ప్రేమకు అంగీకారం తెలపలేదని ఫినాయిల్ తాగి తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు దాంతో రంగ ప్రవేశం చేసిన వెంకట్ స్నేహితులు వెంకట్ ని ఆసుపత్రికి తరలించారు.  ఈ విషయంపై సదరు వెంకట్ పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. దీంతో ఆ నటిని లొంగ దీసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: