స్టార్ నైట్ అంటే హీరోయిన్స్ కు పండుగే.. స్క్రీన్ పై చూపించలేని అందాలన్ని స్టార్ ఈవెంట్ లో గుమ్మరించేస్తారు. అవకాశం వచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ తమ గ్లామర్ షోతో కనువిందు చేస్తారు. గ్లామర్ డాల్స్ కు ప్రత్యేక వేదికగా మారిన ఈ సిని ఈవెంట్ లో ముద్దుగుమ్మలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. రీసెంట్ గా 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల మహోత్సవం జరిగింది. నోవాటెల్ లో జరిగిన ఈ వేడుకలో లీడింగ్ హీరోయిన్స్ అందరు అదరగొట్టే అందాలతో మతులుపోగొట్టారు.    


ప్రత్యేకంగా హోమ్లీ రోల్స్ తో యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న లావణ్య, క్రేజీ సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న రాశి ఖన్నా ఈ ఇద్దరు ఫిల్మ్ ఫేర్ అవార్డు మహోత్సవంలో హాట్ న్యూస్ గా నిలిచారు. ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఆడియెన్స్ మనసు దోచేసే వీరు ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఓ పక్క సినిమాల్లో అదరగొడుతూనే మరో పక్క ఈ ఆఫ్ స్క్రీన్ షో ఈ హీరోయిన్స్ కు ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చిపెడుతుంది.


దొరికిన ఛాన్స్ ను దద్దరిల్లిపోయేలా చేస్తున్న ఈ భామలు.. ఉన్న అవకాశాలు చాల ఇంకా దర్శక నిర్మాతలకు ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ అందాల ప్రదర్శన మూలంగా ఎంతమంది ఎన్ని విధాలుగా డిస్ట్రబ్ అయ్యారో కాని రాశి, లావణ్యల మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు సిని జనాలు.



మరింత సమాచారం తెలుసుకోండి: