ఈ మద్య స్టార్ హీరోలు బుల్లితెరపై తెగ సందడి చేస్తున్నారు.  ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరు ప్రోగ్రామ్ తో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు.  తాజాగా ఇప్పుడు వీరి బాటలోనే నడుస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, కోలీవుడ్ లో కమల్ హాసన్, కన్నడంలో సుదీప్ దుమ్మురేపుతున్నారు.  ఇప్పుడు  టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ‘బిగ్ బాస్’ షో త్వరలోనే ప్రారంభం కానుంది.
Image result for ఎన్టీఆర్ బిగ్ బాస్ టీజర్
స్టార్ మా ట్విట్ట‌ర్ ద్వారా ఇందుకు సంబంధించిన టీజ‌ర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే ఒకప్పుడు జెమ్స్ బాండ్ ఇంట్రడ్యూసింగ్ ఎంత రిచ్ గా ఉండేదో అలాగే కనిపిస్తుంది. ఎన్టీఆర్ క‌న‌ప‌డుతున్న లుక్ అదుర్స్ అనిపిస్తోంది. బ్లాక్ సూట్‌, కొత్త హెయిర్ స్టైల్‌తో ఎన్టీఆర్ అమితంగా ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ టీజర్‌కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. థమన్ నేపథ్య సంగీతం అందించాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ మంచి నటుడిగా తన సత్తా చాటుకున్నాడు.
Image result for ఎన్టీఆర్ బిగ్ బాస్ టీజర్
గత మూడు సంవత్సరాల నుంచి మనోడికి గోల్డెన్ టైమ్ నడుస్తుంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇప్పుడు  తెలుగులో ‘బిగ్ బాస్’ షో తమ అభిమాన హీరో కనిపించ బోతున్నాడని నందమూరి ఫ్యాన్స్ పండుగు చేసుకుంటున్నారు. ప‌లువురు సెల‌బ్రిటీల‌తో సాగే గేమ్ షోగా ఇది ఉంటుంద‌ని టాక్. ప్ర‌స్తుతం వెండితెర‌పై ఓ వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్ బుల్లితెర‌పై ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: