మనిషి గత జ‌న్మ రహస్యాల పై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయాలను నమ్మేవారు ఎందరు ఉంటారో నమ్మని వారు కూడ అంతకు సమానంగానే ఉంటారు. ఈనమ్మకాల పై ఒక ఒక ప్రముఖ ఛానల్ ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాధ్ చెపుతున్న కొందరు ప్రముఖులు టాలీవుడ్ స్టార్లు అయిన కొందరి గత జన్మ విశేషాల పై ఆసక్తికర కథనాలను ఆ ఛానల్ ప్రసారం చేస్తోంది. 

ఈ లిస్టులో ఆమధ్య రాజమౌళి గత జన్మ రహస్యాలను బయట పెట్టిన నాగానాథ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గత జన్మ రహస్యాల పై కొన్ని ఆసక్తికర వివరణలు ఇచ్చాడు. ప్రస్తుతం కోట్లాదిమంది అభిమానులను పొందిన పవన్ కళ్యాణ్ గత జన్మలో మన దేశంలోని ఉత్తర ఈశాన్య ప్రాంతంలో జన్మించాడు అన్న విషయాన్ని బయట పెట్టాడు. 

పవన్ కళ్యాణ్ గత జన్మలో కన్యా లగ్నంలో జన్మించాడు అని అంటూ ఆ జన్మలో పవన్ మంచి అందంగా రొమాంటిక్ పర్సన్ గా జీవితాన్ని గడిపిన నేపధ్యాన్ని వివరించాడు. పవన్ ఒక రాజుల వంశంలో పుట్టిన విషయాన్ని వివరిస్తూ ఆ జన్మలో అనేక గుప్త దానాలు కూడ చేసిన విషయాన్ని నాగనాధ్ బయట పెట్టాడు. 

అంతేకాదు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పరిణామాలు ఎదురైనా ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకు వెళ్ళే ధైర్యం చొరవ గల వ్యక్తిత్వం గత జన్మ నుంచి పవన్ కు ఉంది అన్న విషయాన్ని వివరించాడు. సామాజిక పరంగా పవన్ ఎలాంటి వారినైనా ప్రభావితం చేయగల శక్తి పవన్ కు గత జన్మ నుండి వచ్చిన విషయాన్ని వివరించాడు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుత జీవితంలాగే పెళ్ళికి సంబంధించి గత జీవితంలో కూడ అనేక సమస్యలను ఎదుర్కున్న విషయాలను ఆసక్తికరంగా వివరించాడు నాగానాథ్. పవన్ క్రితం జన్మలో పవన్ వ్యతిరేకులు పవన్ ఆరోగ్యం దెబ్బ తీసే విధంగా ఒక మందు ఇచ్చి గత జన్మలో పవన్ ఆరోగ్యాన్ని పాడుచేసారు అన్న సంచలన విషయాలను కూడ నాగానాథ్ బయట పెట్టాడు. ఎంతో ఆసక్తికరంగా మరెంతో సంచలనంగా మారిన ఈ కార్యక్రమాన్ని తరుచూ ఆ ప్రముఖ ఛానల్ రిపీట్ చేస్తోంది అంటే టిఆర్పి రేటింగ్స్ కోసం ఆ ఛానల్ పవన్ గతజన్మ విశేషాలను కూడ ఏ విధంగా ఉపయోగించుకుంటోందో అర్ధం అవుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: