'బాహుబలి' మూవీ ప్రాజెక్ట్ తో నేషనల్ సెలిబ్రెలిటీగా మారిపోయిన రాజమౌళికి విపరీతమైన పేరుతో పాటు భారీ లాభాలు కూడ వచ్చిన విషయం ఓపెన్ సీక్రెట్. ఈ ప్రాజెక్ట్ కోసం 5 సంవత్సరాలు కష్టపడిన రాజమౌళి అందుకున్న ప్రతిఫలం పై ఆసక్తికర చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి తన పారితోషికాన్ని లాభాలలో వాటాగా తీసుకున్న విషయాన్ని రాజమౌళి ఈమధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఈమూవీకి వచ్చిన లాభాలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు ఇండియాలో ఏ దర్శకుడుకి రానంత భారీ మొత్తం ఈ మూవీ వల్ల రాజమౌళికి వచ్చింది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా విలాశాలకు దూరంగా ఉండే రాజమౌళి లేటెస్ట్ గా బిఎండబ్ల్యూ 7 సిరీస్ కారును కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కారు విలువ దాదాపు 1.50 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీనితో రాజమౌళి కూడ విలాసవంతమైన కార్ల వైపు ఆకర్షింపబడ్డాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈపరిస్థుతులు ఇలా ఉండగా ‘బాహుబలి’ ద్వారా వచ్చిన డబ్బును రాజమౌళి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఈమధ్య వార్తలు వచ్చాయి. 100 ఎకరాల్లో విశాలమైన ఫాంహౌస్ కట్టుకోవడానికి తెలంగాణ ప్రాంతమైన దోనకొండ సమీపంలో 100 ఎకరాల భూమి రాజమౌళి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మామిడి సపోటా తోటలతో ఉన్న ఈ ప్రాంతాన్ని తన అభిరుచికి అనుగుణంగా ఒక అందమైన పల్లెటూరిలా మార్చుకోవడానికి రాజమౌళి భారీ ప్రణాళికలే రచిస్తున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: