గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న సమంత నాగచైతన్యల అక్టోబర్ 6న అధికారికంగా పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. దీనితో తన పెళ్ళికి ముందే సమంత తాను ఒప్పుకున్న సినిమాలను అన్నింటిని పూర్తి చేయాలి అన్న ఉద్దేశ్యంతో పరుగులు తీస్తోంది. 

ఇది ఇలా ఉండగా సమంత ఈమధ్య ఒక అవార్డ్స్ మీట్ లో తన అవార్డ్ ను అందుకుంటూ ఇచ్చిన స్పీచ్ లో ఎక్కువగా చైతన్య ప్రమోషన్ కు సంబంధించిన మాటలు వినిపించడం ఆ అవార్డ్స్ మీట్ కు వచ్చిన చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ అవార్డ్ ను అందుకున్న వెంటనే సమంత తన మొదటి మాటలోనే చైతన్య నామస్మరణ మొదలు పెట్టింది. 

సామాన్యంగా ఇలాంటి అవార్డ్స్ అందుకున్న తరువాత ఆ అవార్డ్ పొందిన వ్యక్తి ఆ సినిమా దర్శకుడు గురించి లేదంటే ఆసినిమాలో నటించిన సహనటుల గురించి ప్రస్తావన చేస్తారు. అయితే దీనికి భిన్నంగా సమంత ప్రవర్తిస్తూ ఈ అవార్డ్స్ మీట్ కు తాను వచ్చే ముందు ‘ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు’ అంటూ చైతన్య తనను ప్రేమతో పలకరించిన నేపధ్యాన్ని గుర్తుకు చేసుకుంది. 

ఈమాటలు ఆమె నోటివెంట విన్నవారు మాత్రం ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ ఫంక్షన్ లో సమంత తన వ్యక్తిగత విషయాల ప్రస్తావన ఏమిటి అంటూ ఆ అవార్డ్స్ మీట్ కు వచ్చిన వారు తమలో తాము కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. అంతేకాదు సమంత వ్యవహార శైలి చూస్తూ ఉంటే చైతన్య కెరియర్ ప్రమోషన్ కోసం ఆమె ఒక పెద్ద పీఆర్ టీమ్ గా మారిపోయి ఇక భవిష్యత్ లో ఎక్కడ కనిపించినా చైతూ నామస్మరణ తో ఆదరగోడుతుందేమో అంటూ మరికొందరు కామెంట్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: