వచ్చే సంవత్సరం అంటే 2018 బాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ ల అరంగేట్రానికి మెయిన్ సంవత్సరంగా చెబుతున్నారు బాలీవుడ్ జనాలు. ఇప్పటికే అందాల శ్రీదేవి తన కూతుఉర్ జాహ్నవి ని అరంగేట్రం చేయించే పనిలో పడింది. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ తో కలిసి జాహ్నవి ఇప్పటికే ఫోటో షూట్ లలో పాల్గొంటోంది. ఈ కొత్త సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆఖర్లో మొదలు అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి .


ఇదే టైం లో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానా కూడా హీరోయిన్ అవతారం ఎత్తడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. నిజానికి షారూఖ్ పెద్ద కొడుకు ఆర్యన్ ని హీరోగా తీసుకుని రావాల్సి ఉంది షారూఖ్ కానీ ఇప్పటి వరకూ ఆ విషయం బయట పెట్టలేదు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్. అయితే సుహానా అరంగేట్రం మాత్రం రాబోతోంది అనీ కరణ్ జోహార్ డైరెక్షన్ లో ఆమె మొదటి సారి తెరమీద కనిపిస్తుంది అనీ అంటున్నారు . " సుహానా పుట్టుక తోనే నటించడం మొదలు పెట్టింది.


థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె రాణిస్తోంది. షబానా అజ్మి లాంటి గొప్ప నటి సుహానీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చూసి మెచ్చుకుంది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు ఆమె నటన మీద ఎంత మక్కువగా ఉందొ. మీడియా హైప్ అంతా ఆర్యన్ కి ఉంది కానీ సుహానా చాలా గొప్ప నటి " అంటూ ఒక షారూక్ ఫామిలీ ఫ్రెండ్ మీడియా కి తెలిపారు. కరణ్ జోహార్ , షారూఖ్ ఖాన్ ఇద్దరూ ఎంత క్లోజ్ అనేది అందరికీ తెలిసిందే .. ఈ నేపధ్యం లో షారూఖ్ సుహానా అరంగేట్రం బాధ్యతలు కరణ్ చేతిలో పెట్టేసాడు


మరింత సమాచారం తెలుసుకోండి: