టాలీవుడ్ లో స్వీటీ అనుష్క గురించి తెలియని వారుండరు చెప్పడంలో సందేహం లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు కేవలం తనకు మాత్రమే సాధ్యమయ్యే పిరియాడికల్ మూవీస్ తో అనుష్క సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఆమె కెరియర్ లో అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. 


ఈ క్రమంలో సైజ్ జీరో కోసం అనవసరంగా లావెక్కిన అనుష్క తన సైజ్ తగ్గించుకునే ప్రయత్నంలో విఫలమయ్యింది. సూర్య నటించిన ఎస్-3లో ఎబ్బెట్టుగా అనిపించిన అమ్మడు బాహుబలి-2 లో కాస్త పర్వాలేదు అనిపించింది. బాహుబలి ప్రమోషన్స్ లో లావుగా కనిపించినా సినిమాలో రాజమౌళి మ్యాజిక్ చేసి ప్రేక్షకులను ఇంప్రెస్ అయ్యేలా చేశాడు. 


ప్రస్తుతం అనుష్క తన ఫిజిక్ మీద బాగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ తనకు యోగా మీద మంచి గ్రిప్ ఉంది కాబట్టి ఇకపై యోగా చేసి ఎలాగోలా తన బరువు తగ్గించే ప్రయత్నం చేయాలని చూస్తుందట. కమిట్ అయిన భాగమతి షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రభాస్ తో సాహో సినిమాలో కూడా అనుష్క హీరోయిన్ గా కన్ఫాం అవుతుందని అంటున్నారు. 


ఇక మరోపక్క మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో కూడా అనుష్కనే కావాలని పట్టుబడుతున్నారట. అనుష్క సన్నబడాలే కాని అమ్మడికి మళ్లీ వరుస ఆఫర్లు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈసారి సన్నబడానికి సీరియస్ గా ప్రయత్నాలు చేస్తుందట స్వీటీ. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: