బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సెక్స్ పై చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఆ కామెంట్స్ కు ప్రస్తుతం యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు అన్న వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సినిమా రంగంలో ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’ గా భావించే షారుఖ్ ఖాన్ తో ఈ కామెంట్స్ అనుష్క ఒక బాలీవుడ్ సినిమాకు సంబంధించి చేసింది. 

దీనితో అనుష్క శర్మ సెక్స్ పై బోల్డ్  గా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక వివరాలలోకి వెళ్ళితే ప్రముఖ దర్శకుడు ఇంతి యాజ్ ఆలీ రూపొందిస్తున్న జబ్ హ్యారీ మెట్ సెజల్ మూవీలోని ట్రైలర్ ను విడుదల చేసారు.ఈ ట్రైలర్ లో యువతకు మతి పోగొట్టే అంశాలు చాలా ఉన్నాయి. ఈమూవీలో అనుష్క పొట్టి దుస్తులతో చాల హాట్‌హాట్‌గా కనిపించింది.

ఈ ట్రైలర్ లో షారూఖ్ ను శృంగారం చేయడానికి అనుష్క రెచ్చ గొట్టినట్లు కనిపిస్తుంది. ‘మన మధ్యలో శృంగారం పూర్తి స్థాయిలో జరిగినా జరుగకపోయినా అందుకు మొత్తం చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అందులో ఏమి మినహాయింపులు ఏమీ ఉండవు’ అని అంటూ అనుష్క చేసిన బోల్డ్ కామెంట్స్ కు యూత్ బాగా కనెక్ట్ అయిపోతున్నారు. 

‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాలో షారూఖ్ పంజాబీ యువకుడుగా కనిపిస్తే అనుష్క గుజరాతి అమ్మాయిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ కు దేశవ్యాప్తంగా విపరీతమైన హిట్స్ యూట్యూబ్ లో వస్తున్నాయి. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా నిర్మించబడుతున్న ఈమూవీ ట్రైలర్ ను ఈనెల 23న విడుదల కాబోతున్న సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ మూవీ ప్రదర్శించే ప్రతి ధియేటర్ లోను ప్రదర్శిస్తూ సల్మాన్ షారూఖ్ ల స్నేహ బంధాన్ని మరొకసారి చాటేలా చేయబోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: