ముఖానికి రంగేసుకున్న వారు రాజకీయాల్లో పనికి రారు అన్న మాటకి బదులిస్తూ తెలుగు ప్రజల గుండెల్లో అటు నటసార్వభౌముడిగా ఇటు రాజకీయవేత్తగా ప్రకంపనలు సృష్టించి చిరస్థాయిలో నిలిచారు నందమూరి తారక రామారావు. ఆయన అడుగుజాడల్లోనే ఎంతోమంది కళాకారులు రాజకీయాల్లో ప్రవేశించారు. ఇక టిడిపిలో కూడా కొందరు అటు రాజకీయాల్లో క్రియాశీల భాధ్యత చేస్తూనే తమలో ఉన్న నటనా ప్రతిభను సమయం వచ్చినప్పుడు బయటపెట్టుకుంటున్నారు.    


ప్రస్తుతం టిడిపి రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు ఓ సీరియల్ లో నటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక సాయంతో 100 ఎపిసోడ్లతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర సీరియల్ రూపంలో తీస్తున్నారు. ఈ సీరియల్ లో లాలాలజపతిరాయ్ పాత్రలో ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నటిస్తున్నట్టు తెలుస్తుంది.    


తెనాలిలో సోమవారం నుండి ఈ సీరియల్ నిర్మాణం మొదలయ్యిందట. ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో అంబేద్కర్, లాలజపతిరాయ్ మధ్య జరిగే డిబెట్ లో గొల్లపల్లి నటిస్తున్నారట. అనుకున్న దాని కన్నా ఎంతో గొప్పగా ఈ సీరియల్ నిర్మాణం జరుగుతుందని అంటున్నారు.


సీరియల్ షూటింగ్ సజావుగా జరుగడానికి కావాల్సిన ఏర్పాట్లన్ని చేసుకున్నారట. ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు నటిస్తున్నారని తెలియడంతో ఈ సీరియల్ మీద ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. 100 ఎపిసోడ్స్ గా రానున్న ఈ సీరియల్ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానెల్ లో ప్రసారమవుతుందని అంటున్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: