తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికీ దాదాపు అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు కనుక వారికంటూ కొన్ని క్వాలిఫికేషన్లు ఉండాలని అనుకుంటారు మెగా ఫ్యాన్స్.  అయితే ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ప్రస్తుతం వీరు స్టార్ హోదాలో ఉన్నారు.  ఈ మద్య ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా నాట్ బ్యాడ్ అనిపించుకుంటున్నారు.

 ఇక అల్లు అర్జున్ తమ్ముడు..స్టార్ ప్రొడ్యూసర్ తనయుడు అల్లు శిరీష్ మాత్రం అనుకున్న స్థాయిని అందుకోలేక పోతున్నాడు.  ‘గౌరవం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తర్వాత వచ్చిన కొత్త జంట చిత్రంతో పరవాలేదు అనిపించుకున్నాడు..ఈ సంవత్సరం వచ్చిన ‘శ్రీరస్తు..శుభమస్తు’ చిత్రం కూడా నాట్ బ్యాడ్ అనిపించుకుంది. కానీ మనోడికి ఏ మాత్రం పేరు రాలేదు..అంతే కాదు ఆ మద్య మళియాళంలోకి ఎంట్రీ ఇచ్చి మోహన్ లాల్ తో నటించాడు. కానీ అక్కడ కూడా గుర్తింపు రాలేదు..తాజాగా అల్లు శిరీష్ ఓ అభిమానికి చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Image result for allu family photos
ఓ అభిమానికి ట్విట్ లో సమాధానం ఇస్తూ..తనకు వర్షం నచ్చదని, అది తనకు రొమాంటిక్‌గా అనిపించదని టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్‌ అన్నారు. సూర్యుడు లేకుండా, ఆకాశం మబ్బులు పట్టి ఉంటే డల్‌గా ఉంటుందని, వర్షం తనకు నచ్చదని ట్వీట్‌ చేశాడు శిరీష్‌. రొమాన్స్‌ కోసమైతే పెళ్లి అక్కర్లేదని, రిలేషన్‌షిప్‌ ఉంటే చాలని అంటున్నాడు అల్లు హీరో శిరీష్‌.  దీనికి ఆ అభిమాని   ‘శిరీష్‌ భయ్యా.. మీకు పెళ్లీడు వచ్చింది. పెళ్లి చేసుకోండి. అప్పుడు మీకు అంతా రొమాంటిక్‌గా అనిపిస్తుంది. రోడ్డు మీద బురద కూడా ఎంతో అందంగా కనిపిస్తుంద’ని ట్వీట్‌ చేశాడు.
Image result for allu family photos
దీనికి ‘వర్షం ఎందుకు సర్‌ ! ఇప్పటికే వర్షం, ట్రాఫిక్‌తో ఇబ్బందిపడుతున్నా. అయినా రొమాన్స్‌కు పెళ్లి అక్కర్లేదు. రిలేషన్‌షిప్‌ చాలు’ అని బదులిచ్చాడు. మరో అభిమాని చిలిపిగా..‘బహుశా మీరు గత జన్మలో గృహిణిగా ఇంట్లో మీ భర్తకు బజ్జీలు, పకోడీలు చేసి పెట్టారేమో’ అని ట్వీట్‌ చేశారు. దీనికి శిరీష్‌ నవ్వుతూ బదులిచ్చారు. ‘అయ్యుండొచ్చు.. ఈ జన్మలో కూడా నా గర్ల్‌ఫ్రెండ్‌ సంపాదనతో జీవిస్తూ.. ఆమెకు వండిపెట్టడానికి నాకు అభ్యంతరం లేదు. హోమ్‌మేకర్‌ (గృహిణి)గా ఉండటం అంత సులభమైన పని కాదు’ అంటూ ట్వీట్టర్లో సమాధానం ఇచ్చాడు. 

అల్లు శిరీష్ ట్విట్ :


మరింత సమాచారం తెలుసుకోండి: