మెగా హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ స్టార్ హీరో సాధించలేని అరుదైన ఘనత సాధించాడు. వరుసగా హిట్లు కొడుతూ 50 కోట్లు అవలీలగా దాటగల సత్తా చాటిన బన్ని సినిమా చేస్తే 50 కోట్లు పక్కా అన్న క్రేజ్ తెచ్చుకున్నాడు. మెగా హీరోల్లో మిగతా హీరోల కంటే బన్నినే స్టార్ క్రేజ్ దక్కించుకున్నాడు. 


ప్రస్తుతం డిజెగా వచ్చేందుకు సిద్ధమైన అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాబోయే తరంలో మెగాస్టార్ మీరేనా అన్న ప్రశ్న ఎదురైంది. ఇక దానికి బదులిస్తూ అల్లు అర్జున్ అలా పోల్చినందుకు హ్యాపీ కాని మెగాస్టార్ అనేది ఓ ఒరిజినల్ పర్సనాలిటీ.. ఆయన్ను ఇమిటేట్ చేయడం అలా స్టెప్పులేయడమే తప్ప అలా అవ్వాలనుకోవడం కష్టం.


మెగాస్టార్ ఒక్కడే ఇంకో మెగాస్టార్ ఉండే అవకాశం లేదు.. మెగాస్టార్ కు సబ్ట్యూట్  అనే వారు ఉండరని అంటున్నాడు బన్ని. ఇక ఎవరి ఒరిజినిలాఇటీ వారిదని ఆయనంటే అపారమైన గౌరవం ఉన్నాయంటున్న అల్లు అర్జున్ నా ఒరిజినాలిటీ నాకుంటుందని అన్నారు. డిజెలో బ్రాహ్మణ వేశంలో కనిపించబోతున్న అల్లు అర్జున్ సినిమాతో మరో హిట్ పక్కా అన్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.   


దిల్ రాజు నిర్మాణంలో హరిష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా ఆమె అందం కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: