ఇండియన్ టెలివిజన్ రంగంలో అత్యంత వివాదాస్పదమైన షోగా పేరుగాంచిన షో ‘బిగ్ బాస్’. ఈ షోకు క్రేజ్ రీత్యా హిందీలో ఎంత మంచి రేటింగ్స్ వచ్చాయో ఈ ‘బిగ్ బాస్’ షోకు ఆ స్థాయికి మించిన విమర్శలు వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఈ షోను తెలుగు బుల్లి తెర పై జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు అన్న వార్తలు రాగానే ఈ షో ప్రారంభం కాకుండానే ఈ షో పై విపరీతమైన అంచనాలు పెరిగి పోతున్నాయి. 

తెలుగు బుల్లితెర చరిత్రలో కనీవినీ ఎరుగని 40 కోట్ల బడ్జెట్ తో త్వరలో షూటింగ్ జరుపుకొబోతున్న ఈ షోకు ఇంకా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఎదురీత మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి. తెలుగు బుల్లితెర ‘బిగ్ బాస్’ షోను హిందీ ఎపిసోడ్స్ కోసం నిర్మించిన ముంబాయి స్టూడియోలోని సెట్స్ లోనే భారీ ఎత్తున చిత్రీకరణ ప్రారంభించ బోతున్నారు. 

దీనితో ఈ షోలో పాల్గొని పార్టిసిపెంట్స్ కూడ టాప్ సెలెబ్రెటీ కుటుంబాల నుండి వచ్చినవారు అయితే మంచి రేటింగ్స్ వస్తాయని ఒక టాప్ సీనియర్ హీరో కుమార్తెను మరో టాప్ డైరెక్టర్స్ కుటుంబాలకు చెందిన మరొక ఇద్దరినీ ఇప్పటికే భారీ మొత్తాలను పారితోషికంగా ఆఫర్ చేస్తూ ఈ ‘బిగ్ బాస్’ షోలో నటించమని అడిగినట్లు టాక్. అయితే వారంతా ‘బిగ్ బాస్’ షో పేరు చెప్పగానే అదిరిపోయి ఈ షోలో నటించలేము అంటూ తమ అయిష్టతను సున్నితంగా తెలిపినట్లు తెలుస్తోంది.

‘బిగ్ బాస్’ షో అంటేనే ద్వందార్ధాలతో కూడిన డైలాగ్స్ తో పాటు రచ్చరచ్చ ఉండే నేపధ్యంలో ఇటువంటి షోలో తాము నటిస్తే తమ కుటుంబాలకు చెడ్డ పేరు వస్తుందని చాలామంది టాప్ సెలెబ్రెటీలు తమ పిల్లలను జూనియర్ ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ ‘బిగ్ బాస్’ షోలో సన్నీలియోన్ రాఖీ సావంత్ వంటి సెలెబ్రెటీలు చేసిన హడావిడి గుర్తుకు రావడంతో తెలుగు బిగ్ బాస్ షోలో నటించడానికి టాలీవుడ్ స్టార్స్ ఎవరూ తమ వారసులను తెలుగు ‘బిగ్ బాస్’ లో పాల్గొనేందుకు దాదాపుగా అనుమతించడం లేదని తెలుస్తోంది. దీనితో మొదలు కాకుండానే జూనియర్ ‘బిగ్ బాస్’ షోకు ఎదురీత మొదలవ్వడం హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: