మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఒక  మంచి పని ఇప్పుడు మెగా ఫాన్స్ కు హాట్ టాపిక్ గా మారడంతో ఆ న్యూస్ కు సంబంధించిన వివరాలను ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మెగా అభిమానులు తెగ బిజీగా ఉన్నారు. ఒక మూడు ఏళ్ళ బాలుడి ప్రాణాలు కాపాడి చరణ్ ఒక పేద కుటుంబంలో సంతోషాన్ని నింపి వారికి దేవుడుగా మారాడు. 
 
దీనితో మెగా స్టార్ చిరంజీవికి తగిన తనయుడు చరణ్ అంటూ మెగా అభిమానులు చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆశక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే రామ్ చరణ్ రాజమండ్రి చుట్టుపక్కల లంక గ్రామాలలో  తన 'రంగంస్థలం 1985' షూటింగ్ కోసం తెగ కష్టపడుతున్న విషయం తెలిసిందే. 

రాజమండ్రి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన ధనుష్‌ అనే మూడేళ్ల బాలుడు మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు గత  ఏప్రియల్ నెలలోచరణ్ ఈ షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చినప్పుడు ధనుష్‌ తల్లి తండ్రులు   చరణ్ కలిసి తమ కష్టాలను వివరించారు. దీనితో వారి కష్టాలకు చెలించిపోయిన చరణ్ తన సొంత ఖర్చుతో హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో ఆ అబ్బాయి వైద్యానికి అవసరమైన ఏర్పాట్లు చేసాడు. 

ఇప్పడు ఆ అబ్బాయికి  చికిత్స పూర్తి అయి తిరిగి పూర్తిగా కోలుకున్న నేపధ్యం లో  ధనుష్ తల్లి తండ్రులు ఈ మధ్య చరణ్ ను తిరిగి   తన ‘రంగస్థలం 1985' షూటింగ్ కోసం రాజమహేంద్రవరం పరిసర గ్రామాలకు వచ్చినప్పుడు చరణ్ ను కలిసి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇప్పడు ఈ న్యూస్ మెగా అభిమానుల మధ్య హాట్ న్యూస్ గా మారడంతో పాటు మీడియాకు కూడ హాట్ న్యూస్ గా మారింది. మరి నటనలో చరణ్  చిరంజీవి వారసుడుగా ఇంకా చరణ్ పూర్తిగా ఎదగక పోయినా సామాజిక సేవలో మాత్రం చిరంజీవి అడుగు జాడలో పయనిస్తున్నాడు అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: