‘దువ్వాడ జగన్నాథం’ ఆడియో ఫంక్షన్ నుండి ఇప్పటి వరకు ఆ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమానికి హాజరవుతున్న బన్నీ చేతిలోని ఒక బొమ్మను చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు. ‘దువ్వాడ’ ఆడియో ఫంక్షన్ లో మొట్టమొదట బన్నీ చేతిలో ఈ బొమ్మను చూసిన చాలామంది ఇది బన్నీ కొడుకు అయాన్ ఆడుకునే బొమ్మ అని భావించారు. 

అయితే ఆ తరువాత కూడ బన్నీ చేతిలో ఈసినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఫంక్షన్స్ లో ఈ బొమ్మ కనిపించడంతో ఈ బొమ్మ సీక్రెట్ ఏమిటి అంటూ చర్చలు మొదలు అయ్యాయి. అయితే ఇది అందరూ అనుకుంటున్నట్లుగా అయాన్ ఆడుకునే బొమ్మ కాదు. ‘స్ట్రెస్ రిలీవింగ్’ టాయ్ గా పేరుగాంచిన ‘ఫిడ్జేట్ స్పిన్నర్’. స్ట్రెస్ రిలీవర్ గా మార్కెట్ లోకి వచ్చిన ఈ టాయ్ 1993 లో మొట్టమొదటిసారి మన ఇండియాలోకి వచ్చింది. 

అయితే ఈ టాయ్ పాపులారిటీ మాత్రం ఈమధ్య కాలంలో చాల ఎక్కువగా ఉంది. సెలెబ్రెటీలు చాలామంది తమ స్ట్రెస్ ను కంట్రోలు చేసుకోవడానికి ప్రస్తుతం ఈ టాయ్ ని తమ చేతిలో పెట్టుకుని తమ ఇమోషన్స్ ను కంట్రోల్ లో పెట్టుకుంటున్నారు. కేవలం 150 రూపాయల ధర ఉండే ఈ స్ట్రెస్ టాయ్ ఇప్పుడు బన్నీ చేతిలో కనిపిస్తూ ఉండటంతో ఈ టాయ్ పై అందరి దృష్టి పడింది.

దీనితో ప్రస్తుతం బన్నీకి వచ్చిన స్ట్రెస్ ఏమిటి అన్న విషయం పై చర్చలు జరుగుతున్నాయి. మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘దువ్వాడ జగన్నాథం’ పై రిజల్ట్ గురించి బన్నీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడా ? లేదంటే మరేదైనా టెన్షన్ బన్నీ మనసులో ఉందా ? అన్న కోణంలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా ఈ స్ట్రెస్ టాయ్ విషయం అందరికీ తెలియడంతో అనుకోకుండా ఈ టాయ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ మారిపోయాడు అంటూ కొంతమంది జోక్ చేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: