తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల బొమ్మాలి అనుష్క.  ఆ తర్వాత అనూహ్యంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ సంపాదించింది.   ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయినా అనుష్క ఇప్పటికీ మంచి క్రేజ్ ఉన్న నటిగా కొనసాగుతుంది.  అయితే సినిమా ఇండస్ట్రీకి రాకముందు అనుష్క యోగ టీచర్ గా కొనసాగింది.  చిన్నప్పటి నుంచి యోగా పై ఎంతో మక్కువ పెంచుకున్న అనుష్క అతే తన ప్రొఫెషన్ గా  కొనసాగించింది.  
Image result for anushka yoga
ఈ రోజు యోగా డే సందర్భంగా కొన్ని విషయాలు మీడియాతో పంచుకుంది.  యోగా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి తెలిపింది. ఈ సందర్భంగా తన ఫోటోను పోస్టు చేసిన ఆమె, దానిపై తన జీవితంలో యోగా తెచ్చిన మార్పును గుర్తుచేసుకుంటూ, ‘యోగా టీచర్‌గా మారాలన్నది నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాల్లో మర్చిపోలేనిది.  వాస్తవానికి మా కుటుంబంలో అందరూ డాక్టర్లు,ఇంజనీర్లే ఎక్కువ ఉన్నారు..కానీ నేను మాత్రం యోగా పై ఎక్కువ మక్కువ పెంచుకున్నాను.
Image result for anushka yoga
ఒక రకంగా అదే నన్ను సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్లేలా చేసింది.  ఇక యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవడమే కాకుండా మంచి ఫిట్ నెస్ తో ఉండవచ్చు అంటుంది అనుష్క.    నా జీవితంలో చోటుచేసుకున్న పెను మార్పులకు యోగానే కారణం. హ్యాపీ ఇంటర్నేషనల్‌ యోగా డే’ అంటూ ధ్యానం చేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసింది ‘దేవసేన’. ‘బాహుబలి’ సినిమా తర్వాత అనుష్క ‘భాగమతి’ చిత్రంలో నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: