సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ప్రతి హీరోయిన్ స్టార్ కావాలని కలలు కంటుంది. అయితే మొదటి సినిమానే కాదు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని స్టార్ స్టేటస్ అందుకోవాలి. ఈ క్రమంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యువత మనసులో రాక్షసిగా స్థానం సంపాదించుకున్న ఆ భామ ఇప్పుడు ప్రమోషనల్ స్టంట్స్ చేస్తుందని తెలుస్తుంది.


ఇప్పటిదాకా హోంలీ పాత్రలతో అలరించిన ఈ అమ్మడు ఛాన్స్ దొరికితే ఎలాంటి పాత్రలనైనా చేసేందుకు సిద్ధమే అంటుంది. రీసెంట్ గా జరిగిన అవార్డ్ ఫెస్టివల్ లో అందాలను ప్రదర్శనగా పెట్టిన ఆ హీరోయిన్ ఇక నుండి కాస్టూమ్స్ సైజ్ ఇంకాస్త తగ్గించాలని తన డిజైనర్ కు చెప్పిందట. తనని చూడగానే ఆడియెన్స్ మాత్రమే కాదు దర్శక నిర్మాతలు కూడా ఫ్లాట్ అవ్వాలనే ఉద్దేశంతో అమ్మడు ఈ ప్లాన్ వేసిందట.  


అవార్డ్ ఫంక్షన్ ఏదైనా తారల తళుకుబెళుకులు ఉండాల్సిందే.. ఆన్ స్క్రీన్ ఎన్ని అందాలను గుమ్మరిస్తారో దానికి ఏమాత్రం తగ్గకుండా ఆఫ్ స్క్రీన్ లైవ్ లో ఈవెంట్ లో ఉన్న వారిని ఆకర్షించేలా వారి లుక్ ఉంటుంది. అమ్మడు చేసిన ఈ హాట్ అటెంప్ట్ వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో సినిమాలున్నా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్న ఈ భామ అవకాశాలను అందుకునేందుకు అదిరిపోయే స్కెచ్ వేసిందని చెప్పొచ్చు. 


ఇన్నాళ్ల కెరియర్ లో ఇప్పటిదాకా హాట్ అటెంప్ట్ చేయని అమ్మడు.. ఇక చేయబోయే సినిమాల్లో హాట్ హాట్ గా కనిపించడానికి ఫిక్స్ అయ్యింది. మరి హీరోయిన్ లోని ఈ మార్పు అమ్మడి దశ తిరిగేలా చేస్తుందో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: