టాప్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు ఆ హీరోకు ఉండే యాంటీ ఫ్యాన్స్ అర్ధరాత్రి ఆ టాప్ హీరో సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన నుండి ఆ సినిమా పై నెగిటివ్ టాక్ తీసుకురావడానికి తమ శక్తిమేరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. టాప్ హీరోల ప్రీమియర్ షోలు ప్రదర్శించే ధియేటర్లలో హీరోల అభిమానులతో సమానంగా ఆ హీరోల యాంటీ ఫ్యాన్స్ కనిపిస్తూ ఉండటం ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది. 

అంతేకాదు ఆ ప్రీమియర్ షో ముగిసిన వెంటనే ఆ సినిమాలో ఉండే లోపాలను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం యాంటీ ఫ్యాన్స్ ప్రధానమైన పనిగా మారిపోయింది. ఈ విషయాలు అన్నీ గుర్తుకు వచ్చి ముఖ్యంగా పవన్ అభిమానుల నుండి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి కాబోలు ‘దువ్వాడ జగన్నాథం’ కు స్పెషల్ షోలు బెనిఫిట్ షోలు వద్దని అల్లు అర్జున్ నిర్మాత దిల్ రాజ్ కు సూచించినట్లు టాక్. 

ఫిలింనగర్ లో ప్రస్తుతం వినపడుతున్న వార్తల ప్రకారం నైజాం ప్రాంతంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్య పట్టణాలలో ఈసినిమాకు సంబంధించి స్పెషల్ షోలు వేసే అవకాశం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈసినిమా టాక్ మొదటిరోజు మొదటి షో నుండి మాత్రమే బయటకు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో మన తెలుగు రాష్ట్రాలు రెండింటి నుంచి ఈమూవీ 18 కోట్ల ఓపెనింగ్ డే కలక్షన్స్ వసూలు చేసే ఆస్కారం ఉంది అని అంటున్నారు. మొత్తం మీద ‘డీజే’ మొదటి రోజు వసూళ్ళు ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

అన్నీ ఊహించినట్లుగా జరిగితే ఈ మూవీకి మొదటి వారం 50 కోట్ల కలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంది అని అంటున్నారు. అయితే ఈ మూవీకి ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా ఈ అంచనాలు అన్నీ తారుమారు అయ్యే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: