యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు టీజర్ రిలీజ్ డేట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో జై లవకుశ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా చేశారు చిత్రయూనిట్. 


ఎన్.టి.ఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న జై లవకుశ ఫస్ట్ లుక్ టీజర్ జూలై మొదటి వారంలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. జై లవకుశ నిర్మాణ సంస్థ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ ట్విట్టర్ పేజ్ లో ఈ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.


జనతా గ్యారేజ్ తో మళ్లీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న తారక్ ఈసారి మళ్లీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. డిఫరెంట్ కథ కథనాలతో రాబోతున్న జై లవకుశ సెప్టెంబర్ 1న రిలీజ్ అని అంటున్నారు. జూలై 5న కళ్యాణ్ రాం పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.  


స్టార్ సినిమా అంటే టీజర్ నుండి హంగామా షురూ అయినట్టే. టీజర్ యూట్యూబ్ వ్యూయర్ కౌంట్ నుండి సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేసేదాకా ఫ్యాన్స్ అంతా ప్రత్యక్ష సాక్షులుగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: