మెగా హీరోల్లో చేసిన అతి తక్కువ సినిమాలతోనే అభిమానుల్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ రెండు హిట్లు పడ్డాయో లేదో సుప్రీం హీరోగా స్క్రీన్ నేం కూడా సంపాదించాడు. సుప్రీం తర్వాత తిక్క, విన్నర్ ఫ్లాపులతో కాస్త డిస్ట్రబ్ అయిన తేజ్ ప్రస్తుతం జవాన్ గా రాబోతున్నాడు.


రైటర్ బివిఎస్ రవి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ లుక్ తో సినిమా మీద అంచనాలను పెరిగేలా చేశారు చిత్రయూనిట్. జవాన్ ఇంటికొక్కడు క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమా పోస్టర్ లో తేజ్ ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తేజ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడనిపిస్తుంది.


మెహెరిన్ కౌర్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే సినిమా మీద పాజిటివ్ ఫీల్ తీసుకువచ్చింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఇదే కాకుండా కృష్ణవంశీ డైరక్షన్ లో వస్తున్న నక్షత్రంలో కూడా తేజ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అసలైతే సందీప్ కిషన్ హీరోగా వస్తున్న నక్షత్రం సినిమాలో సాయి ధరం తేజ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడని తెలుస్తుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: