జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం మహేష్ మ్యానియాకు చెక్ పెట్టె విధంగా మారిందని మహేష్ అభిమానులు కలవర పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలకావాల్సిన ‘స్పైడర్’  టీజర్ ఒకరోజు ఆలస్యంగా విడుదలైనప్పటికీ అశేష అభిమానుల ప్రశంసలు పొందడంతో పాటు అప్పటివరకు ‘స్పైడర్’ మూవీ పై ఉన్న నెగిటివ్ అభిప్రాయాన్ని తొలగిపోయేలా చేసి యూట్యూబ్ లో ‘స్పైడర్’ టీజర్ రికార్డులు క్రియేట్ చేసి కేవలం 24 గంటలలో ఈ టీజర్ కు అత్యధిక హిట్స్ వచ్చేలా చేసింది. 
 
దీనితో ‘స్పైడర్’ సినిమా పై ఒకేసారి అంచనాలు పెరిగి పోయాయి ఇప్పుడు ‘స్పైడర్’ తరువాత విడుదల అవుతున్న తొలి పెద్ద హీరో సినిమా టీజర్ గా మారబోతున్న జూనియర్ ‘జై లవ కుశ’ టీజర్ విడుదలకు కౌంట్ దౌన్ మొదలైంది. ఈ మూవీ టీజర్ ను జూలై మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాత కళ్యాణ్ రామ్ అధికారికంగా ప్రకటించాడు. 

ఇప్పటికే జూనియర్ అభిమానులలో భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈమూవీ ‘స్పైడర్’ పేరుతో ఇప్పటి వరకు ఉన్న యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తుందని మహేష్ అభిమానులు ఇప్పటి నుంచే కలవర పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘స్పైడర్’ ‘జై లవ కుశ’ సినిమాల విడుదల తేదీల మధ్య కొంచం గ్యాప్ ఉన్నా ఒకే నెలలో విడుదలకాబోతున్న ఈ రెండు సినిమాలలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న అంచనాలకు సంబంధించిన లెక్కలు ఇప్పటికే మొదలు అయిపోయాయి.

దసరా రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతున్న సినిమాలు ఇంకా చాల ఉన్నా ప్రధాన పోటీ ‘స్పైడర్’ ‘జై లవ కుశ’ ల మధ్య ఉంటుంది అన్న అంచనాలు మార్కెట్ వర్గాలలో ఉన్నాయి. అయితే జూనియర్ మహేష్ లకు సంబంధించిన ఈ రెండు సినిమాలు రెండు విభిన్నమైన జోనర్లకు సంబంధించినవి కాబట్టి ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటాయి అన్న అంచనాలతో ఈ రెండు సినిమాల పై బయ్యర్లు అత్యంత భారీ మొత్తాలను పెట్టుబడిగా పెడుతున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: