మరి కొద్ది గంటలలో విడుదల కాబోతున్న ‘దువ్వాడ జగన్నాధం’ రిజల్ట్ గురించి బన్నీ అభిమానులతో పాటుగా సాధారణ ప్రేక్షకులు కూడ అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అన్న పట్టుదలతో బన్నీ అనేక మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇస్తూ ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. 

ఈ నేపధ్యంలో ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ఈ చిత్ర ప్రమోషన్ కోసం యూట్యూబ్ లో నిర్వహించిన చర్చ గోష్టిలో అల్లు అర్జున్ పూజ హెగ్డే తో కలిసి పాల్గొని ఆ కార్యక్రమంలో సందడి చేసాడు. అయితే బన్నీ ఈ కార్యక్రమంలో పూజ హెగ్డే మాటల పై బహిరంగంగానే అసహనం వ్యక్త పరచడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

ఈ కార్యక్రమంలో పూజ బన్నీ డాన్సింగ్ టాలెంట్ గురించి మాట్లాడుతూ బన్నీని టాలీవుడ్ మైఖేల్ జాక్సన్ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. అయితే ఈ ప్రశంసలకు అల్లుఅర్జున్ పొంగిపోకుండా పూజ పై ఇదే కార్యక్రమంలో రివర్స్ సెటైర్ వేసాడు. ఎప్పుడూ పూజ తన డాన్స్ టాలెంట్ గురించి మాట్లాడుతోంది కానీ నటుడుగా తాను ‘దువ్వాడ’ లో కనపరిచిన ప్రతిభ గురించి ఎందుకు మాట్లాడదు అంటూ జోక్ చేసేసరికి పూజ నోటివెంట మాటలు రాలేదు. 

కార్యక్రమం రక్తికట్టించడానికి బన్నీ వేసిన ఎత్తుగడ బాగా సక్సస్ కావడంతో అల్లు అర్జున్ పూజా పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు ఐరన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే ఈసినిమా విడుదల కాకుండానే కోటి రూపాయల పారితోషికం తీసుకునే లిస్టులోకి చేరిపోయింది అంటే ‘దువ్వాడ జగన్నాథం’ పూజ హెగ్డే కెరియర్ గ్రాఫ్ ను ఏ విధంగా మార్చి వేసిందో అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: