తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.   మనోడు చేసిన సినిమాలు వేళ్లపై లెక్క పెట్టొచ్చు..అందులో దాదాపు అన్నీ మంచి విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రాలే.   సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే టాకీ పార్టు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇటలీ లో రెండు పాట‌లు షూటింగ్ జ‌రుపుకున్నారు.

ఈ నెల 23 నుండి హైదరాబాద్ లో యాక్ష‌న్ పార్టు చిత్రీక‌రిస్తారు. మిగిలిన షూటింగ్ పార్ట్ అంతా జులై లో షూట్ చేసి అగ‌ష్టు లో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్, టైటిల్ కి చాలా మంచి స్పంద‌న రావ‌టంతో యూనిట్ స‌భ్యులు మ‌రింత ఉత్సాహంతో వున్నారు.  ఇక నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..సాయి ధరమ్ తేజ్ కు మా బ్యానర్ కు మంచి రిలేషన్ ఉంది. బివిఎస్ రవి మా ప్రొడక్షన్ కి మాకు మంచి రిలేష‌న్ వుంది. జవాన్ స్టోరీ చాలా బాగుంటుంది సాయి ధరమ్ తేజ్ కు సరిగ్గా సరిపోయే స్టోరీ.
Image result for subramanyam for sale songs
ఈ చిత్రాన్ని మా సన్నిహితుడు కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నట్టుగా అనుకున్న టైం లో చాలా బాగా వచ్చింది. జ‌వాన్ ప్రీలుక్ చాలా బాగుంది అలానే ఇప్ప‌డు విడుద‌ల చేసిన మెద‌టి లుక్ కూడా చాలా బాగుంది.  అంతే కాదు ఈ సినిమాతో సాయి ధరమ్ మరో సూపర్ హిట్ అందుకో బోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  సాయిధరమ్ తో చేసిని సినిమాలు సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు జవాన్ చిత్రం కూడా మంచి హిట్ అవుతుందని అంటున్నారు దిల్ రాజు.  
Image result for supreme telugu movie
ఈ చిత్రంలో మెస్సేజ్ తో పాటు ఫుల్ ఎంట్రటైన్ మెంట్ జోడించామని ఇలాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని అన్నారు.  నటీనటులు - సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్,  కెమెరా మెన్ - కెవి గుహన్, మ్యూజిక్ - తమన్, ఆర్ట్ - బ్రహ్మ కడలి, ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్, సహ రచయితలు - కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి, బ్యానర్ - అరుణాచల్ క్రియేషన్స్, సమర్పణ - దిల్ రాజు, నిర్మాత - కృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి



మరింత సమాచారం తెలుసుకోండి: