మహేష్ నటిస్తున్న ‘స్పైడర్’ విడుదల గురించి అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే మహేష్ సినిమా విడుదల కాకుండానే కొరటాల శివ తీస్తున్న ‘భరత్ అను నేను’ మూవీ షూటింగ్ లో నిన్నటి నుంచి జాయిన్ అయ్యాడు.  ‘దూకుడు’ సినిమాలో తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకొని యంగ్ పొలిటీషియన్ గా మహేష్ బాబు ఇప్పటికే కనిపించినా ఈ సినిమాలో ముఖ్య మంత్రిగా కనిపించబోతున్న నేపధ్యంలో కొరటాల మహేష్ లుక్ పై అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్ బేగంపేటలో ఒక పెద్ద భవనంలో ప్రారంభం అయింది. అసెంబ్లీ ని పోలి ఉన్న ఒక సెట్ ను ఆ భవనంలో వేశారు. ఇప్పటికే ‘భరత్ అనే నేను’ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఆ షెడ్యూల్ ను కొరటాల కంప్లీట్ చేసాడు. 

ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించిన సీన్స్ చిత్రీకరణ పూర్తి అయిన తరువాత  ఈ మూవీ లండన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ ముఖ్య మంత్రి లుక్ గురించి అనేక మంది ప్రముఖ రాజకీయ వేత్తల లుక్ ను పరిశీలించిన తరువాత కొరటాల మహేష్ కోసం డిజైన్ చేయించిన లుక్ మహేష్ బాగా నచ్చడంతో ఆ లుక్ ను చూసి ఈ మూవీ యూనిట్ సభ్యులే షాక్ అయినట్లు టాక్. దీనితో ఈ లుక్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా కొరటాల చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు  చేసినట్లు తెలుస్తోంది. 

అయితే ‘స్పైడర్’ సినిమాపై కొరటాల శివ సినిమా లండన్ షెడ్యూల్ ఆధారపడి ఉంది అని అంటూ న్నారు. ‘స్పైడర్’ టాకీ కంప్లీట్ అయినప్పటికీ 2 పాటల షూటింగ్ పెండింగ్ ఉంది. ఆ పాటల షూటింగ్ పూర్తి అయిన తరువాత మాత్రమే ఈ మూవీ లండన్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. వచ్చే ఏడాది జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అన్న టార్గెట్ తో పరుగులు తీస్తున్న ఈ మూవీ కథ రాజకీయాల నేపధ్యంతో ఉండటంతో ఈ మూవీని పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: