ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హీరో తన కుటుంబానికే కాకుండా సమాజాంలో ఎవ్వరికి అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి విలన్లతో పోరాడి మొత్తానికి వారికి న్యాయం జరిగేలా చూస్తాడు. ఇది రీల్ లైఫ్..కానీ రియల్ లైఫ్ లో కూడా కొంత మంది హీరోలు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ తమ మంచితనాన్ని చాటుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే..మెగాస్టార్ చిరంజీవి బ్లెడ్ బ్యాంక్ ద్వారా ఎన్న లక్షల మంది కుటుంబాలను ఆదుకున్నారు.  ఆపదలో ఉన్న రోగులకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించారు.  
Image result for mega family
తర్వాత అంత గొప్ప హృదయం ఉందని చాటుకున్నాడు..పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తన అభిమాన హీరోని చూడాలని జీవన్మరణ పోరాటం చేసి పవన్ కళ్యాణ్ సహాయంతో బ్రతికి బయట పడ్డ చిన్నారి శ్రీజ  ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది.  ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్.  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985' షూటింగ్ మళ్లీ రాజమహేంద్రవరం పరిసరాల్లో జరుగుతుంది.  
Image result for శ్రీజ కు సహాయం చేసిన పవన్
ఆ సమయంలో హీరో రాంచరణ్ ఓ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి కరిగిపోయాడు. రాజమహేంద్రవరం గ్రామానికి చెందిన ధనుష్‌ అనే మూడేళ్ల బాలుడు మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు. రాజమహేంద్రవరం పరిసరాల్లో షూటింగ్ జరుతుగుందని తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు రాంచరణ్ ని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.  
కరిగిపోయిన చరణ్
వెంటనే స్పందించిన చెర్రీ హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో ధనుష్‌కు చికిత్స చేయించాడు. ఇపుడు ధనుష్ పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు...ఇక ఆ బాలుడి తల్లిదండ్రలు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.  మళ్లీ రాజమహేంద్రవరం పరిసరాల్లోనే జరుగుతుండటంతో ధనుష్ కుటుంబం చరణ్‌ను కలిసి... ఆయన చేసిన మేలుకు ధన్యవాదాలు తెలిపారు.

Image result for rangasthalam 1985

 


మరింత సమాచారం తెలుసుకోండి: