సౌత్ లో క్రేజీ ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో కచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. పవర్ స్టార్ అంటూ గొంతు పెకిలేలా అరచి కేకలు వేసి తమ అభిమానాన్ని చూపించే ఫ్యాన్స్ ఉంటారు. ఇక పవన్ ఆరాధించే ఫ్యాన్స్ తమ అభిమాన నటుడు ఎక్కడికైనా వస్తున్నాడని తెలిస్తే చాలు ఆ పాంత్రం అంతా అభిమాన సంద్రమై నిండిపోవాల్సిందే.  


మన పర బేధాలేవి లేకుండా మైండ్ లో ఫిక్స్ అయితే చాలు బ్లైండ్ గా వెల్లే పవన్ కేవలం విఐపిల ఇంటికే కాదు తమ అభిమానుల ఇంటికి పరామర్షకు వెళ్తాడు. తన కోసం ఎండనకా వాననకా ఒక్క సారి పవన్ చూప్పు తమ మీద పడితే చాలు.. ఒక్క సారి తమ పవర్ స్టార్ అన్న గళం పవన్ కు వినిపిస్తే చాలు అనుకునే అభిమానులున్నారు.        


తనకు ఎంత క్రేజ్ ఉన్నా అభిమానుల ముందు అదే టెక్కు చూపించని హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే ఆ ఏరియా మొత్తం పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా షురూ అవుతుంది. పవన్ మేనియా తెలిసేలా ఆ సందడి ఏ రేంజ్ లో ఉంటుందంటే ఒక్కసారి అక్కడ అభిమానుల సునామి వచ్చినట్టే అనిపిస్తుంది.


ఎక్కడ ఎక్కుతున్నామో ఎక్కడకి దూకుతున్నామో ఎక్కడికి వెళ్తునామో అన్నది ఏం ఆలోచించకుండా పవన్ ను ఒక్కసారి చూసేందుకు అభిమానులు చేసే హంగామా ఇది. అది నిజం కాదని వాదించే వారు ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం రీల్ హీరోగా ఉన్న పవర్ స్టార్ రియల్ హీరోగా జన నాయకుడు అవుధామనే ఆలోచనతో జనసేన పార్టీని స్థాపించాడు. ప్రశ్నించాడానికే అంటూ సంచలనం సృష్టిస్తున్న పవర్ స్టార్ ఈ అభిమాన జన గళంతో ఎలాంటి చరిత్ర సృష్టిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: