ప్రస్తుతం వరస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ హవా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా తెలుగు బుల్లితెర చరుత్రలో కనీవినీ ఎరుగని బడ్జెట్ తో రూపొందింపబడుతూ మరో రెండు నెలలలో ప్రారంభంకాబోతున్న బుల్లితెర మెగా షో బిగ్ బాస్ ను జూనియర్ హోస్ట్ చేయబోతున్న నేపధ్యంలో జూనియర్ క్రేజ్ మరింత పెరిగింది. 
 
ఇలాంటి పరిస్థుతులలో సీనియర్ ఎన్టీఆర్ గా జూనియర్ నటించబోతున్నాడు అని వార్తలు రావడం సంచలనంగా మారడమే కాకుండా ఆవార్తలు బాలకృష్ణకు కూడ షాక్ ఇస్తున్నట్లు టాక్. ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం సావిత్రి జీవితం పై అశ్విని దత్ నిర్మిస్తున్న సినిమాలో జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ గా కనిపించ బోతున్నాడని  తెలుస్తోంది. 

కీర్తి సురేష్ సావిత్రిగా నటిస్తున్న మహానటి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గా జూనియర్ నటిస్తే ఈ సినిమాకు క్రేజ్ తో పాటు బిజినెస్ కూడ బాగా జరుగుతుంది అన్న ఆలోచనలతో నిర్మాత అశ్విని దత్ ఈ విషయ మై జూనియర్ ను కలవడం ఈ ప్రపోజల్ పట్ల జూనియర్ ఆసక్తి కనపరచడం జరిగింది అని అంటున్నారు. అయితే రాబోతున్న ఎన్నికలలోపు ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించాలని తండ్రి పాత్రను బాలయ్య పోషించాలని ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రాధమిక పనులు చేయిస్తున్న బాలకృష్ణకు ఈన్యూస్ ఊహించని షాక్ గా మారింది అని అంటున్నారు. 

అయితే ఈ పరిస్థితులలో జూనియర్ బాలకృష్ణ కంటే ముందుగానే మహానటి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గా కనిపిస్తే ఇక బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ మూవీలోని లుక్ కు మహానటి సావిత్రి సినిమాలో జూనియర్ లుక్ కు పోలుస్తూ రకరకాల కామెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈనేపధ్యంలో బాలయ్య సీనియర్ ఎన్టీఆర్ సినిమాను తీసే ఆలోచన శాశ్వతంగా అటక ఎక్కించే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనితో ఈ వార్తలలోని యదార్ధం ఎంత అనే విషయాలను సేకరించే క్రమంలో బాలకృష్ణ వ్యూహాలు ఉన్నాయి అని టాక్. సావిత్రి సినిమాలో జూనియర్ నటించి, ఎన్టీఆర్ లా కనిపిస్తే ఖచ్చితంగా మంచి మార్కులు పడతాయి అన్నది వాస్తవం. దీనితో జూనియర్ బాలకృష్ణకు అనుకోని షాక్ ఇచ్చాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: