సినిమా హీరోలంటే ఎవ్వరికైనా వెర్రి ఆనందమే..ముఖ్యంగా స్టార్ హీరోలంటే ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉండదు.  ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మెగా, నందమూరి, అక్కినేని ఫ్యామిలీ హీరోలంటే పడి చచ్చిపోతారు అభిమానులు.  వీరికి ఉన్నన్ని అభిమాన సంఘాలు ఎవ్వరికీ లేవన్నా ఆశ్చర్యం లేదు.  అయితే కొన్ని సార్లు తమ అభిమానులు చేస్తున్న పనుల వల్ల హీరోలు చిక్కుల్లో పడుతుంటారు.  ఆ మద్య పవన్, ప్రభాస్ హీరోలు కొట్టుకోవడం..అది రచ్చ రచ్చ కావడం హీరోలు జోక్యం చేసుకొని తమ మద్య అన్నదమ్ముల అనుబంధం ఉందని ఇండస్ట్రీలో హీరోల మద్య ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని అభిమానులు కూడా అదేవిధంగా ఉండాలని నచ్చజెప్పారు.  

ఇక తమ అభిమాన హీరోల సినిమాలు వచ్చాయంటే చాలు..థియేటర్ల వద్ద కోలాహలంగా ఉంటుంది.  ఎవరి స్థాయిని బట్టి వారు తమ అభిమానాన్ని చూపించుకుంటారు.  కొన్ని సార్లు అభిమానులు చూపించే అభిమానం తట్టుకోలేని విధంగా ఉండటం..ఆ ఇబ్బందుల్లో అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతూనే ఉంటుంది.  తాజాగా నందమూరి బాలకృష్ణ  ‘పైసా వసూల్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఆ సమయంలో కొంత మంది అభిమానులు బాలయ్యతో ఫోటో తీయించుకోవాలని ఎంతో ఆశతో వచ్చారు.  

అయితే తన అభిమాన సంఘం నుంచి వచ్చిన వారితో ఫోటో దిగుతూ..ఓ వక్తిపై వారి తాలూకు కాదని తెలిసి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన పక్కన ఫోటో కోసం వచ్చిన వ్యక్తీ మీతో పాటా అన్నారు..కాదు అనగానే పో బైటికి..అంటూ ఎదురుగా ఉన్న మరో వ్యక్తి ఏంటీ ఆ లుక్..పెద్ద పుడింగిలాగా..అంటూ సీరియస్ అయ్యాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: