Image result for bahubali 2 images masco international film


రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు గీటురాయి బాహుబలి 2 ది కంక్లూజన్ తన విజయయాత్ర కొనసాగిస్తూనే ఉంది. ఈ నాటికీ భారత్ లో నిర్మించబడి దేశంలో అత్త్యంత గరిష్ఠ వసూళ్ళు సాధించిన తొలి సినిమాగా దీని ప్రతిష్ఠ చిరస్థాయిగా నిలుస్తుంది.  


రికార్డ్ కలెక్షన్లు సాధించి "బిగెస్ట్ ఇండియన్ ఫిలిం" గా అవతరించిన బాహుబలి 2 ది కంక్లూజన్ సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈ సినిమాను మరో "ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్" లో ప్రదర్శించనున్నారు. నిన్న నే అంటే ఈ నెల 22న ప్రారంభమైన "మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్" లో బాహుబలి 2 ది కంక్లూజన్ ను "ప్రారంభ-చిత్రం" గా ప్రదర్శించారు. 

Image result for bahubali 2 images masco international film

ఇటీవల జరిగి 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్' తో పాటు, 'రొమేనియా ఫిలిం ఫెస్టివల్' లోనూ,  బాహుబలి 2 ది కంక్లూజన్ కు మంచి స్పందన లభించింది. మాస్కో లోనూ అదే స్థాయిలో స్పందన వస్తుందని గౌరవం లభిస్తుందని ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది లోనూ "హైయ్యస్ట్ గ్రాస్" సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ది కంక్లూజన్ ఇప్పటి వరకు 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. 


త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తుండటంతో ఈ వసూళ్ళ ప్రభంజనం మరింత సునామీ అయ్యే అవకాశం ఉంది. ఈ చారిత్రాత్మక చిత్రం తన జైత్రయాత్రలో మరిన్ని అరుదైన గౌరవాదరాభిమానాలు పొందాలని ఆశిస్షాం. 

Image result for bahubali 2 images masco international film

మరింత సమాచారం తెలుసుకోండి: