గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకు ఓవర్ సీస్ కలక్షన్స్ కీలకంగా మారడంతో టాప్ హీరోల ఓవర్ సీస్ కలక్షన్స్ మధ్య పోటీ కూడ విపరీతంగా పెరిగి పోతోంది. దీనికితోడు టాప్ హీరోల సినిమాలను ఓవర్ సీస్ ప్రేక్షకులు బగా చూస్తున్న నేపధ్యంలో కలక్షన్స్ బాగా పెరిగి ఓవర్ సి మార్కెట్ లో టాప్ హీరోల మూవీలకు మంచి ఆఫర్లు ఓవర్ సీస్ బయ్యర్ల నుండి వస్తున్నాయి. అయితే ఈ పరిస్థుతులకు విరుద్ధంగా లేటెస్ట్ గా నిర్మాణం జరుపు కొంటున్న పవన్ మహేష్ జూనియర్ ల సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ లో ఒకేసారి ఎదురీత మొదలు అవ్వడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్, ఎన్టీఆర్, పవన్ సినిమాలను ఓవర్సీస్‌లో కొనుగోలు చేయడానికి డిస్టిబ్యూటర్లు రావడం లేదనే విషయం షాకింగ్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తూ నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమాకు సుమారు 100 కోట్ల బడ్జెట్ అయిన నేపధ్యంలో ఈ మూవీ ఓవర్ సీస్ రైట్స్ ను 15 కోట్లకు ఓవర్ సీస్ బయ్యర్లకు ఆఫర్ చేసినట్లు టాక్. అయితే వారెవ్వరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం ఆ రేటును 14 కోట్లకు తగ్గించినా ఇంకా ఎవరూ ఓవర్సీస్ బయ్యర్లు ఆశక్తి కనపరచడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీకి కూడ ఇదే పరిస్థితి ఓవర్సీస్ మార్కట్ లో ఏర్పడింది అని అంటున్నారు. ఈ మూవీకి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నైజాం, ఆంధ్రా సీడెడ్ ప్రాంతాలకు మంచి రెట్లు పలికినా ఓవర్ సీస్ లో మాత్రం ఈ మూవీకి బయ్యర్ల విషయంలో ఎదురీత మొదలైంది అంటున్నారు. ఈ మూవీ ఓవర్ సీస్ రైట్స్ ను 20 కోట్లకు ఫిక్స్ చేసిన నేపధ్యంలో ఆ రేటు విని చాలామంది భయ పడిపోతున్నట్లు టాక్. దీనికితోడు మురగదాస్ మహేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘స్పైడర్’ సినిమాకు కూడ ఇదే పరిస్థితి అని అంటున్నారు. 

మహేష్ సినిమాలకు ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీకి 25 కోట్ల ఆఫర్ ను ఈసినిమా నిర్మాతలు చెపుతున్నట్లు టాక్. అయితే ఈ రేటు విని కూడ బయ్యర్లు భయపడి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ ప్రేక్షకులు రివ్యూలను చూసి మాత్రమే టాప్ హీరోల సినిమాలను కూడ చూసే పరిస్థుతులు ఏర్పడటంతో టాప్ హీరోల క్రేజ్ కంటే రివ్యూలు కీలకంగా మారాయి. 

ఈ పరిస్థుతులలో ఎంతటి టాప్ హీరో సినిమాకు అయినా నెగిటివ్ టాక్ క్షణాలలో స్ప్రెడ్ అవుతున్న పరిస్థుతులలో కేవలం వారి క్రేజ్ ను ఆధారంగా తీసుకుని వారి సినిమాలను అత్యంత భారీ మొత్తాలకు కొనలేమని ఓవర్సీస్ బయ్యర్లు లేటెస్ట్ గా అనుసరిస్తున్న వ్యూహం టాప్ హీరోల సినిమాల నిర్మాతలకు శాపంగా మారింది అని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: