తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ ఫుల్ డైరెక్టర్ గా ఎదిగిపోయిన రాజమౌళి  తన 100 శాతం సక్సెస్ రేటుతో పాటు ‘బాహుబలి’ సాధించిన అత్యంత ఘన విజయంతో రాజమౌళి భవిష్యత్ లో తీయబోయే సినిమాలకు ఏ రేంజ్ లో పారితోషికం తీసుకుంటాడు అన్న ఆసక్తి  రోజురోజుకి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెరిగి పోతోంది. 1600 కోట్లకు పైగా వసూలు చేసిన 'బాహుబలి' ప్రాజెక్టుకు రాజమౌళి  లాభాల్లో పర్సంటేజ్ తీసుకున్న విషయం తెలిసిందే. 

‘బాహుబలి’ ప్రాజెక్టుతో రాజమౌళి రెమ్యూనరేషన్ విషయం పర్సంటేజీ లెక్కల్లోకి మారడంతో పలువురు టాలీవుడ్ నిర్మాతల్లో ఆందోళన మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు స్టార్ హీరోల పారితోషికం పర్సెంటేజ్ లోకి మారిన నేపధ్యంలో ఇప్పుడు రాజమౌళి కూడ అదే పద్ధతిని అనుసరిస్తే భవిష్యత్ లో రాజమౌళితో సినిమాలు తీయడం ఎలా అని చాలామంది టాలీవుడ్ నిర్మాతలు మధన పడుతున్నట్లు టాక్.

ఈ విషయాలు అన్నీ రాజమౌళి దృష్టికి రావడంతో రాజమౌళి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తాను తన భవిష్యత్ సినిమాలకు కేవలం ఫిక్సెడ్ పారితోషికం మాత్రమే తీసుకుంటానని అందరూ అనుకుంటున్నట్లుగా పర్సెంటేజ్ కాడని సంకేతాలు పంపుతున్నట్లు టాక్. అంతేకాదు తన భవిష్యత్ సినిమాలు అన్నీ ‘బాహుబలి’ లా ఉండవని అది ఒక ప్రత్యేకమైన అధ్యాయం అంటూ స్పష్టమైన సంకేతాలు రాజమౌళి ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా ‘బాహుబలి 2’ విడుదలై దాదాపు 60 రోజులు అయిపోతున్నా రాజమౌళి తీయబోయే తదుపరి సినిమా స్క్రిప్ట్ విషయమై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొన్ని కథలు చెప్పినా ఆ కథలు పూర్తిగా రాజమౌళికి నచ్చకపోవడంతో కథ ఎంపిక విషయమై మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. రాజమౌళి అడిగితే డేట్స్ ఇవ్వడానికి టాప్ హీరోలు అందరూ రెడీగా ఉన్నా రాజమౌళి మాత్రం తన మనసులోని మాట బయట పెట్టకుండా తన వ్యూహాత్మక మౌనాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: