తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చారు..అయితే స్టార్ ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు తనయుడు విక్టరీ వెంకటేష్ నట వారసుడిగా ‘లీడర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు రానా.  తన తాత రామానాయుడు పేరులోని మొదటి అక్షరాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా చేసినవి కొన్ని సినిమాలే..కాకపోతే  ఆ సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.  అయితే తెలుగు కాకుండా హిందీ లో ఇండస్ట్రీలో రానాకు మంచి పేరు వచ్చింది. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు రానా.
Image result for నేను రాజు నేనే మంత్రి
 ఇక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ఏకంగా జాతీయ స్థాయి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  హీరో ప్రభాస్ తో సమానంగా ప్రతినాయకుడి పాత్రలో రానా చూపించిన నటన కు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.  సరైన హీరోయిజం తెరపై చూపించలేకపోయినా రానా దగ్గుబాటి.. బాహుబలి సినిమాతో మాత్రం భల్లాలదేవ అంటూ విలనీ బాగానే పండించాడు. అందుకే అలాంటి షేడ్స్ ఒక పాత్రను హీరోగా చూపిస్తే రానా అందులో ఎలా ఉంటాడు? బాగానే ఇమిడిపోతాడు అనిపిస్తోంది.
Image result for నేను రాజు నేనే మంత్రి
తేజ డైరక్షన్లో రూపొందుతున్న 'నేనే రాజు నేను మంత్రి' సినిమాతో పర్ఫెక్ట్ హీరోయిజాన్ని చూపించబోతున్నాడు రానా.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  రానా పంచ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి..‘లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం సీటు నా ముడ్డికింద ఉండాలి’. ‘వంద మంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్లో కూర్చోబెడితే సాయంత్రానికల్లా నేనూ అవుతా సీఎం’.
Image result for నేను రాజు నేనే మంత్రి
మావా ఎనకటికి ఓ సామెత ఉండేది..పాముకి పుట్ట కావాలంటే చీమలే కదరా కష్టపడాలి. ఇలాంటి డైలాగ్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.  మరి ఈ సినిమా రానాకు ఎంత వరకు మంచి పేరు తీసుకు వస్తుందో వేచి చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: