తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింత్ తనయుడు...తన హాస్యంతో ఎంతో మంది హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన మహానటులు అల్లు రామలింగయ్య మనవడిగా ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్.  మొదటి సినిమా లో పెద్దగా హీరోయిజం చూపించకున్నా..తర్వాత వచ్చిన దేశముదురు, బన్ని, ఆర్య చిత్రాలో అసలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఇలా ఉండాలని డ్యాన్స్, ఫైట్స్ లో తన సత్తా చూపించాడు.  
Image result for duvvada jagannadham posters
తర్వాత వచ్చిన సినిమాలతో ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.  గత సంవత్సరం ‘సరైనోడు’ చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేసిన బన్నీ తాజాగా హరీష్ శంకర్ తో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమాపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు ఉన్నాయి..అయితే ‘గుడిలో బడిలో’ అనే పాటపై వివాదాలు చుట్టు ముట్టడంతో సినిమాపై మరింత ఫోకస్ పెరిగింది.  ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపాయి.  ఇక సినిమా విషయానికి వస్తే..ఓ బ్రాహ్మణ కుర్రాడు తన కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నంలో తన అగ్రహారంలో ఉన్నవారి కష్టాలు ఎలా తీర్చాడు.. ఓ పోలీస్ ఆఫీసర్ తో కలిసి లోకల్ గా ఉన్న పెద్ద గుండాను ఎలా ఎదుర్కొన్నాడు..అనేది చిత్ర కథనం.  
Image result for duvvada jagannadham posters
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటిసారి కెరియర్ లో బ్రాహ్మణ వేశంలో కనిపించిన బన్ని పర్ఫార్మెన్స్ లో మాత్రం అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివెరీలో కూడా ప్రత్యేకతను చూపాడు. బన్ని సినిమాలో డ్యాన్స్ లో వావ్ ఫ్యాక్టర్ ఉండాల్సిందే.  హీరోయిన్ పూజా హెగ్దె సినిమాలో గ్లామర్ షో చేసింది. సినిమాకు పూజా గ్లామర్ చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మురళి శర్మ, రావు రమేష్ లు తమ పర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకున్నారు.  
Image result for duvvada jagannadham posters
ఇక కామెడీ విషయంలో అల్లు అర్జున్ కి సపోర్ట్ గా వెన్నెల కిషోర్, సుబ్బ రాజు లు కూడా అద్భుతంగా నటించారని టాక్.  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలెట్.. దేవి మ్యూజిక్ కు బన్ని డ్యాన్సులు అదరహో అనిపిస్తాయి. ఇక సినిమా దర్శకుడు హరిష్ శంకర్ తన మార్క్ చూపించాడు.  ఏది ఏమైనా అల్లు అర్జున్ ‘సరైనోడు’ తర్వాత ‘దువ్వాడ జగన్నాథం’ తో బంపర్ హిట్ కొట్టబోతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.  సినిమా రిజల్ట్ రేపటి వరకు ఎలా ఉంటుందో..ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉన్నాయి..సినిమా హిట్టా..ఫట్టా అన్న విషయం రేపటితో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: