కోలీవుడ్ హీరో విజయ్ కి తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తమిళ యువత విజయ్ ని   ‘దళపతి’ గా  ఆరాధిస్తారు. ఈ అభిమానం వల్లే  విజయ్ ని అతడి అభిమానులు తమిళ రాజకీయాలలోకి రమ్మని ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఆ రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా విజయ్ వరస పెట్టి సినిమాలు  చేసుకుంటూ పోతున్నాడు. 

అయితే ఈమధ్య కాలంలో విజయ్ నటించిన చాలా సినిమాలు వరస పరాజయాలు చెందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ టాప్ హీరో అజిత్ హవా ముందు విజయ్ సినిమాలు నిలబడ లేకపోతున్నాయి. ఈ పరిస్థితులలో విజయ్ టాలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకోవడానికి టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున అతడి కొడుకు నాగచైతన్యల ఇమేజ్ వాడుకుంటూ ఉండటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఈ నేపధ్యంలో విజయ్ నాగార్జున నాగ చైతన్యాల పేరు చెప్పి తన సినిమా ట్రైలర్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా అతడు నటించిన మూవీ 'ఏజె౦ట్ భైరవ' ట్రైలర్ విడుదల చేసారు. విజయ్ హీరోగా భరతన్ దర్శకత్వ౦లో రూపొ౦దిన తమిళ చిత్ర౦'భైరవ' కి ఇది డబ్బింగ్.  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటి౦చిన ఈ చిత్ర౦ తమిళ౦లో అట్టర్ ఫ్లాప్ అయింది.
 
అయినా ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు..  నిన్న విడుదల అయినఈ ట్రైలర్ లో హీరో విజయ్ తన స్నేహితుడిని ప్రేమ గురి౦చి సలహా అడుగుతా . 'లవ్ క౦టూ పెద్ద ట్రె౦డు ఉ౦డదు గురూ ప్రేమ గురించి  అప్పట్లో నాగార్జున లవ్ లెటర్స్ వ్రాసేవాడు. ఇప్పడు నాగచైతన్య ట్విట్స్ పెడుతున్నాడు అంటూ అక్కినేని హీరోల అభిమానుల దృష్టి విజయ్ లేటెస్ట్ సినిమా వైపు పడేలా చేస్తున్నారు. ఏమైనా విజయ్ సినిమాలో అక్కినేని హీరోల ప్రస్తావన రావడం నాగార్జున చైతూల అభిమానులకు మంచి జోష్ ను ఇస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: