తెలుగు పరిశ్రమలో కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల దాకా హీరోయిన్స్ కొరత ఉండనే ఉంటుంది. ఇక ఈ క్రమంలో టాలీవుడ్ లో ఈమధ్య ఓ భామ హడావిడి ఎక్కువైంది. ముకుందతో ఎంట్రీ ఇచ్చిన ఆ బ్యూటీ ఒక లైలా కోసంలో చైతు పక్కన నటించి మెప్పించింది. ఇక కెరియర్ లో హిట్ కోసం తపిస్తున్న ఈ భామ ప్రస్తుతం ఐరన్ లెగ్ అనే బ్యాడ్ నేం మోస్తుంది.


ఈరోజు రిలీజ్ అయిన స్టైలిష్ స్టార్ దువ్వాడ జగన్నాధం సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. సినిమాలో అమ్మడిని అందాల ప్రదర్శన కోసమే తీసుకున్నారంటే నమ్మాలి. బికినిలో కూడా దర్శనమిచ్చి అందరిని సర్ ప్రైజ్ చేసింది పూజా హెగ్దె. నాజూకైన అందాలతో ప్రేక్షకులను తన ముగ్గులో దించాలని పూజా చేసిన ప్రయత్నం డిజెలో ఫలించిందనే చెప్పాలి.


డిజె సినిమా టాక్ యావరేజ్ అని వస్తున్నా సినిమాలో ఆమె హాట్ లుక్స్ కు మంచి మార్కులే పడినట్టు ఉన్నాయి. డిజె సెట్స్ మీద ఉండగానే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో కూడా ఆమెను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ప్రభాస్ సాహోతో పాటుగా మహేష్, వంశీ పైడిపల్లి సినిమాకు ఆమెని అడిగారని టాక్.


సో చూస్తుంటే అమ్మడికి లక్ కలిసి వచ్చేట్టు ఉంది. ఇక వరుస అవకాశాలతో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒక్క హిట్ లేకపోయినా అమ్మడి దశ మార్చే సినిమా ఏదో ఒకటి అవుతుందని ఆశిస్తున్నారు. డిజెతో కొద్దిగా పర్వాలేదు అనిపించుకున్న పూజా ముందుముందు ఎలాంటి హిట్లు సాధిస్తుందో చూడాలి.
  



మరింత సమాచారం తెలుసుకోండి: