భారీ అంచనాల మధ్య విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’కు కంటెంట్ తక్కువ హడావిడి ఎక్కువ అన్న ఓపెన్ టాక్ బయటకు రావడంతో ఇది కేవలం అల్లుఅర్జున్ అభిమానులకు మాత్రమే నచ్చే సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. దీనితో ‘దువ్వాడ’ ను అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు ఈ సినిమా భవిష్యత్ పై భయపడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈసినిమా చుట్టూ మరో సరికొత్త వివాదం చుట్టుకుంది. గాయత్రీ మంత్రాన్ని హిందూ మతంలో ఉండే ప్రతీ వ్యక్తీ పరమ పవిత్రంగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ మంత్రాన్ని పఠించటానికి కూడా సమయాన్నీ, స్థలాన్నీ పరిగణ లోకి తీసుకుంటారు. చెప్పులు వేసుకొనీ, శరీరం అపరిశుభ్రంగా ఉన్నప్పుడూ ఈ మంత్రాన్ని పఠించటం దోషంగా భావిస్తారు. 

గతంలో పదిహేనేళ్ళ కిందట అమితాబ్ షూ వేసుకొని ఈ మంత్రాన్ని పఠించిన ఒక సినిమాలోని ఒక సన్నివేశం దేశవ్యాప్తంగా విమర్శలకు కారణం అయ్యింది. శివసేన చేసిన ఆందోళనతో ఆ సన్ని వేశాన్ని తర్వాత ఆ సినిమా నుండి తెలిగించి వేసారు. 

ఇప్పుడు అదే సందర్భం ‘దువ్వాడ జగన్నాథం’ లో ఉంది అంటూ మరో వివాదం మొదలైంది. 24 ముద్రలతో 24 వైబ్రేషన్స్‌ తో ఉండే గాయత్రి మంత్రాన్ని ‘దువ్వాడ’ లో హీరో అల్లు అర్జున్ చెప్పులు వేసుకుని చదవడం హిందువుల మనో భావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అంటూ కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇంటర్వెల్‌ ముందు వచ్చే సన్నివేశంలో బన్నీ గాయత్రి మంత్రాన్ని చెప్పులు వేసుకుని చదివే సందర్భం కనిపిస్తుంది. ఒక బ్రాహ్మణుడు దర్శకత్వం వహించిన సినిమాలో గాయత్రి మంత్రానికి ఇలాంటి అవమానాలు ఏమిటి అన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విమర్శలతో ఈ సీన్ ను ఈసినిమా నుండి తొలగిస్తారా లేదంటే ఇలాగే కొనసాగిస్తారా అన్న విషయం చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: