తెలుగు, తమిళ, హిందీ,మళియాళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఆల్‌ ఇండియా స్టార్‌ గా పేరు తెచ్చుకుంది శ్రీదేవి. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి దర్శకులు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పదహారేళ్ల వయసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.   ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్రనటులతో నటించి తక్కువ కాలంలో ఎంతో పేరు తెచ్చుకుంది.  అప్పట్లో శ్రీదేవి ఉన్న చిత్రాలంటే యువత ఊరకలేసి వెళ్లేవారట. తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నెంబర్ వన్ తారగా వెలిగిపోయింది. బాలీవుడ్  స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహం చేసుకొని స్థిరపడింది.  

తాజాగా దేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్‌స‌. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తెలుగు లో అతిలోక సుందరి శ్రీదేవితో 24 4 సినిమాలు చేసిన ఏకైక దర్శకుడిని నేనే అన్నారు.  

ఇక శ్రీదేవి డేట్స్ ఇచ్చి..సురేష్ బాబు ప్రొడ్యూస్ చేసి..కోన కథ రాస్తే అదిరిపో సూపర్ హిట్ అందిస్తానని అన్నారు. సాధారణంగా సినిమా రివ్యూలు చూసిన తర్వాత ఆ సినిమాకి వెళ్లాలా లేదా.. అని ఆలోచిస్తాం. కానీ శ్రీదేవి నటించిన ఏ చిత్రం అయినా ఏలాంటి రివ్యూలు చూడకుండా వెళ్తాం..ఎందుకంటే..హండ్రెడ్‌ పర్సెంట్‌ గ్లామర్‌గా వుంటుంది. యాక్టింగ్‌ ఇరగ్గొడుతుంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ డాన్స్‌ బాగా చేస్తుంది.

ఇన్ని క్వాలిటీస్‌ వున్న తర్వాత హండ్రెడ్‌ పర్సెంట్‌ బాగుంటుంది అన్నారు.  శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత మామ్ లాంటి గొప్ప చిత్రాన్ని సెలక్ట్ చేసుకోవడం అంటే ఆ సినిమా హండ్రెడ్‌ పర్సెంట్‌ నమ్మకం వున్న స్టోరీ, డైరెక్టర్‌ దొరికాడని డిసైడ్ కావటమే. కాబట్టి హండ్రెడ్‌ పర్సెంట్‌ ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుంది'' అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: