నిన్న విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’ చాలామంది ఊహించినట్లుగానే డివైడ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ చాల బాగుంది అని బన్నీ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే ఈ సినిమాను చూసిన సామాన్య ప్రేక్షకుడు మాత్రం పెదవి విరుస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ మూవీకి రివ్యూ రేటింగ్స్ కూడ చాల తక్కువ స్థాయిలో రావడంతో షాక్ కు గురైన హరీష్ శంకర్ ఈ మీడియా రేటింగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక కలక్షన్స్ వసూలు చేస్తున్న సినిమాలకు ఆ సినిమాలకు విమర్శకులు ఇస్తున్న రేటింగ్స్ కు సంబంధం లేకుండా పోయిందని రివ్యూల పై సెటైర్లు వేసాడు హరీష్ శంకర్. అంతేకాదు కేవలం పది కోట్ల పెట్టుబడితో దిల్ రాజ్ నిర్మించిన ‘శతమానం భవతి’ సినిమాకు 40 కోట్ల కలక్షన్స్ వచ్చినా ఆ సినిమా పై ఏ విమర్శకుడు ప్రశంసలు కురిపించని నేపధ్యాన్ని వివరిస్తూ ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించకపోయినా నేషనల్ అవార్డ్ వచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసాడు హరీష్ శంకర్. 

అంతేకాదు మూవీ రేటింగ్స్ అన్నవి సినిమాలను బట్టి కాకుండా ఆ సినిమాలను చూసే వ్యక్తిగత అభిప్రాయాలకు విలువనిచ్చే విధంగా మూవీ రేటింగ్స్ మారిపోవడం దురదృష్టకరం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు ఈ ‘దువ్వాడ’ దర్శకుడు. ఇది ఇలా ఉండగా ఈసినిమా టాక్ ఎలా ఉన్నా నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా కలెక్ట్ చేసిన కలక్షన్స్ అల్లుఅర్జున్ కెరియర్ లో కనీవినీ ఎరుగని కొత్త రికార్డులను క్రియేట్ చేసింది అని అంటున్నారు.

ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 32 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చాయి అన్న వార్త సంచలనంగా మారింది. మరొక మూడు రోజులు హాలిడేస్ అవ్వడంతో ఈసినిమాకు టాక్ తో సంబంధం లేకుండా ఈ హాలుడే వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈమూవీకి సుమారు 70 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఇప్పట్లో ఏ భారీ సినిమా పోటీ లేకపోవడం ‘దువ్వాడ జగన్నాథం’ బయ్యర్లకు కలిసి వచ్చే అంశంగా  మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: