మిల్కీ బ్యూటీగా దాదాపు దశాబ్దం పైగా ఎన్నో సినిమాలలో మరెందరో హీరోలతో నటించిన తమన్నా కెరియర్ ప్రస్తుతం క్రాస్ రోడ్స్ లో ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటి నుంచి తమన్నా కెరియర్ సక్సస్ ఫెయిల్యూర్ ల మధ్య దోబూచులాడుతూ కొనసాగడంతో ఆమె కెరియర్ కు సంబంధించి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడ చెప్పుకోవడానికి ఈ దశాబ్ద కాలంలో ఏ ఒక్కటి మిగలలేదు. 

ఇలాంటి పరిస్థుతులలో ‘బాహుబలి’ లాంటి భారీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం వచ్చినా తమన్నాకు ఆమె కెరియర్ కు సంబంధించి ఏ మాత్రం కలిసి రాకపోవడంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు కరువైపోయాయి. దీనితో ఆమె దృష్టి కోలీవుడ్ పై పడి అక్కడ తన హవాను చాటుదామని ప్రయత్నాలు చేసింది. 

ఈ ప్రయత్నాలలో భాగంగా తమన్నా గత సంవత్సరం ప్రభుదేవాతో కలిసి నటించిన ‘అభినేత్రి’ సినిమా తెలుగు తమిళ హిందీ భాషలలో విడుదల చేసినా ఆ సినిమాను ఏ భాష సినిమా ప్రేక్షకులు పట్టించుకోక పోవడంతో ఆ సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారింది. మధ్యలో బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ‘క్వీన్’ సినిమాను తెలుగు తమిళ భాషలలో రీ మెక్ చేయాలని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నించినా తమన్నా అడిగే కోరికలకు ఆ నిర్మాత భయపడి పారిపోయాడు అన్న వార్తలు ఉన్నాయి. 

ప్రస్తుతం తెలుగులో చేయడానికి ఒక్క సినిమా కూడ లేని తమన్నా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పెళ్ళి చూపులు’ తమిళ రీమేక్ లో నటిస్తోంది. అయితే ఇటువంటి పాత్రలు తమన్నాకు సరిపోవు అన్న కామెంట్స్ కోలీవుడ్ మీడియా ఆమె పై చేస్తోంది. ‘బాహుబలి 2’ లో ఎంత వెతికినా కనీసం రెండు సీన్స్ లో మించి కనిపించని తమన్నాకు ‘బాహుబలి 2’ కేవలం ఎందుకూ ఉపయోగ పాడనీ బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది అని అనుకోవాలి. 
మూడు పదులు దాటిపోయినా నయనతారా అనుష్క కాజల్ లాంటి హీరోయిన్స్ కు ఇంకా అవకాశాలు రావడమే కాకుండా వారి పారితోషికాలు కోట్లాది రూపాయల స్థాయిలో కొనసాగుతూ ఉంటే చేయడానికి సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న తమన్నా పరిస్థితి చూసి అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు కరువై పోయారు అన్న కామెంట్స్ ప్రస్తుతం చాల ఎక్కువగా వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: