సినిమా ఇండస్ట్రీల అనగానే అదో రంగుల ప్రపంచం అనుకుంటారు ఎంతో మంది.  ఒక్కసారి సినిమా చాన్స్ వస్తే చాలు ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ఫీల్ అవుతారు.  వెండి తెరపై, బుల్లి తెరపై చాన్స్ వస్తే అదీ కాస్త మంచి పేరు వస్తే సెలబ్రెటీ అవుతారు. అయితే కొంత మందికి సినిమా చాన్సులు వచ్చినా..సక్సెస్ కాలేక జీవితంలో అంతా కోల్పోయామని ఆత్మహత్యలు చేసుకోవం..మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది.  3 ఏళ్ల కిందట నటుడు భరత్- సంధ్య జంటగా నటించిన ‘కాదల్‌’ ఫిల్మ్ సంచలన విజయం సాధించింది.
Image result for bharath premisthe
తెలుగులో ‘ప్రేమిస్తే’ చిత్రంలో పల్లుబాబుగా అలరించిన నటుడు ఆ తర్వాత సినిమా చాన్సులు రాకపోవడంతో.. ఓ వైపు పేదరికం, మరోవైపు పేరెంట్స్ మరణంతో మానసికంగా కుంగిపోయాడు .  ప్రేమిస్తే చిత్రంలో కూడా  సినిమా అవకాశాలను వెతుక్కుంటూ చెన్నైకి వచ్చి ఓ మ్యాన్షన్‌లో ఉండే యువకుడిగా నటించాడు.  

నిజ జీవితంలో కూడా అతనికి ఏమీ కలిసి రాకపోవడంతో మానసికంగా కుంగిపోయి..చివరికు కడుపు నింపుకోవడానికి స్థానిక చూలైమేడులోని గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు.  ఆ గుడి వద్దకు వచ్చిన కొంతరు పల్లు బాబుని గుర్తు పట్టి అతని దీన స్థితికి బాధపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: