సంబంధిత చిత్రం


తమిళ చిత్ర రంగంలో ఉప్పెనలా అగ్రపథానికి ఏదిగిన నటుడు విజయ్. కొన్ని సినిమాలైతే రజనీకాంత్ సినిమాలతో పోటీపడి తమిళంలో అగ్రనటుని స్థాయికి చేరిపోయాడు. కొలీవుడ్ లో స్థిరపడ్డ తరవాత తన మార్కెట్ ను మాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ రంగాలకు విస్తరించుకునే పనిలో పడ్డాడు విజయ్.

vijay adirindi heroine కోసం చిత్ర ఫలితం

తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలని ప్రయత్నించిన తమిళ స్టార్ హీరో విజయ్ గత కొన్నేళ్లలో ఇక్కడ ఒక మాదిరిగా అంటే చాప కింద నెరులాగా ఫాలోయింగ్ సంపా దించాడు. తుపాకి, జిల్లా లాంటి సినిమాలు తెలుగులో చెప్పుకోదగ్గ విజయాలే సాధించాయి. గత ఏడాది వచ్చిన "పోలీస్" కొంత నిరాశపరిచింది. ఐతే ఇప్పుడు విజయ్ చేస్తున్న కొత్తసినిమా మాత్రం తెలుగు లో అతడికి మంచి ఫలితాన్నిస్తుందన్న అంచనాలున్నాయి.

vijay adirindi heroine కోసం చిత్ర ఫలితం

ఎందుకంటే ఈ చిత్రానికి కథ అందించింది మన స్టార్ రైటర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. "రాజా రాణి" తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన అట్లీ నే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ మొన్న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. తమిళంలో ఈ చిత్రానికి "మెర్సల్" అనే టైటిల్ పెట్టారు. తమిళ టైటిల్ ప్రకటించిన రెండు రోజు లకే తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి తెలుగులో "అదిరింది" అనే టైటిల్ పెట్టడం విశేషం.

vijay adirindi heroine కోసం చిత్ర ఫలితం

విజయ్ సరసన సమంత, కాజల్, నిత్యా మీనన్ లాంటి అందగత్తెలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండటం కూడా తెలుగు వెర్షన్ కు కలిసొచ్చే అంశమే. తెలుగు లో కొంచెం భారీగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతు న్నారు. ఈ చిత్రం "తెండ్రాల్ ఫిలిమ్స్ సంస్థ" కు 100వ సినిమా కావడం విశేషం.  దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆ సంస్థ సినిమాపై భారీగా ఖర్చు చేస్తోంది. తెలుగులో కూడా ప్రమోషన్ గట్టిగా చేసి పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. దీపావళి కానుకగా అక్టోబరు 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.  

vijay mersel heroine కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: